గడిచిన 3 నెలల్లో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన సినిమాల లిస్ట్..!

2020 లో సంక్రాంతికి ‘అల వైకుంఠపురములో’ మరియు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు రికార్డు కలెక్షన్లు నమోదు చెయ్యడం.. ఆ వెంటనే ‘భీష్మ’ ‘హిట్’ వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడంతో టాలీవుడ్ కు పెద్ద దిష్టే తగిలినట్టు ఉంది. అందుకేనేమో కరోనా లాక్ డౌన్ కారణంగా ఏకంగా 9 నెలలు పైనే థియేటర్లు మూతపడ్డాయి. చిత్రసీమ మొత్తం అతలాకుతలం అయిపోయింది. కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు ఆ మహమ్మారి దెబ్బకు వరల్డ్ లో ఉన్న థియేటర్లు మొత్తం మూతపడ్డాయి. మళ్ళీ థియేటర్లు తెరుచుకుంటాయా.. సినీ పరిశ్రమ కోలుకుంటుందా అనే అనుమానాల నడుమ మన టాలీవుడ్ ఇండస్ట్రీ త్వరగానే కోలుకుంది అని చెప్పాలి.

డిసెంబర్లో ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రంతో థియేటర్లు ఓపెన్ అయ్యాయి. ఇక జనవరి నుండీ వరుస సినిమాలు విడుదలవుతూ వస్తున్నాయి. గడిచిన 3 నెలల్లో విడుదలైనవి మీడియం రేంజ్ హీరోల సినిమాలే అయినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి అనే చెప్పాలి. మరి జనవరి నుండీ మార్చి వరకూ మంచి కలెక్షన్లను రాబట్టిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

హిట్స్ అండ్ బ్లాక్ బస్టర్స్ :

1) క్రాక్ :

మాస్ మహారాజ్ రవితేజ కంబ్యాక్ మూవీ ఇది.గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం.. 50 శాతం ఆకుపెన్సీతో విడుదలైనప్పటికీ కూడా ఫుల్ రన్లో ఏకంగా రూ.40 కోట్ల షేర్ ను నమోదు చేసింది. ఈ చిత్రం కొన్న బయ్యర్లకు రెండింతల లాభాలను అందించి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

2) మాస్టర్ :

తమిళ డబ్బింగ్ సినిమానే అయినప్పటికీ.. తెలుగులో విజయ్- విజయ్ సేతుపతిల క్రేజ్ కారణంగా ఈ చిత్రం ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఫుల్ రన్లో 14 కోట్ల పైనే షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

3) రెడ్ :

రామ్- కిషోర్ తిరుమల కాంబినేషన్లో రూపొందిన ‘రెడ్’ మూవీ కూడా సంక్రాంతికి విడుదలయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. ఫుల్ రన్లో ఈ చిత్రం 19 కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది.

4) 30 రోజుల్లో ప్రేమించడం ఎలా:

యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఫుల్ రన్లో ఈ చిత్రం 7 కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది.

5) జాంబీ రెడ్డి :

దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించిన ‘జాంబీ రెడ్డి’ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఫుల్ రన్లో ఈ చిత్రం 6కోట్ల పైనే షేర్ ను రాబట్టింది.

6) ఉప్పెన :

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చిబాబు సానా డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి వంటి అన్-సీజన్లో విడుదల అయినప్పటికీ ఫుల్ రన్లో ఏకంగా 51 కోట్ల షేర్ ను రాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

7) నాంది :

అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఫుల్ రన్లో ఈ చిత్రం 5కోట్ల పైనే షేర్ ను నమోదు చేసింది. 8 ఏళ్లుగా ప్లాపులతో సతమతమవుతున్న అల్లరి నరేష్ కు తిరిగి విజయాల బాట పట్టేలా చేసింది.

8) జాతి రత్నాలు :

నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ,ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అనుదీప్ డైరెక్ట్ చేసాడు. ఈ చిత్రం ఇప్పటికీ డీసెంట్ రన్ ను కొనసాగిస్తుంది. ఇప్పటి వరకూ ఈ చిత్రం 37కోట్ల పైనే షేర్ ను రాబట్టి.. ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

యావరేజెస్ :

1) అల్లుడు అదుర్స్ :

ఈ సినిమాకి మౌత్ టాక్ అయితే డిజాస్టర్ గా బాప్ అన్నట్టు వచ్చింది. కానీ సంక్రాంతి పండుగ పేరు చెప్పుకుని ఫుల్ రన్లో 8కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. దాంతో ఈ చిత్రం యావరేజ్ గా నిలిచింది అని చెప్పాలి.

2) ఏ1 ఎక్స్ ప్రెస్ :

సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ ను సంపాదించుకుంది. కానీ కొత్త సినిమాల ఎఫెక్ట్ వలన ఫైనల్ గా యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది. ఫుల్ రన్లో ఈ చిత్రం 4.5 కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది.

3) రంగ్ దే :

నితిన్, కీర్తి సురేష్ లు జంటగా నటించిన ‘రంగ్ దే’ చిత్రం హిట్ టాక్ ను సంపాదించుకుంది. అయితే కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ వలన ప్రస్తుతానికి యావరేజ్ కలెక్షన్లను మాత్రమే నమోదు చేసింది. ఇప్పటి వరకూ ఈ చిత్రం 15 కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. ఫైనల్ గా ఈ చిత్రం యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus