2024 లోకి ఎంటర్ అవ్వడం.. అప్పుడే జనవరి నెల పూర్తి కావడం అయిపోయింది. ఇక ఈ జనవరి నెలలో మొత్తంగా జనవరి నెలలో 20 స్ట్రైట్ తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అలాగే ఒక డబ్బింగ్ సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. అవే ‘సర్కారు నౌకరి’ ‘1134 ‘ ’14 డేస్ లవ్’ ‘దీనమ్మ జీవితం’ ‘డబుల్ ఇంజిన్’ ‘ప్లాంట్ మెన్’ ‘ప్రేమ కథ’ ‘రాఘవ రెడ్డి’ ‘షాన్’ ‘గుంటూరు కారం’ ‘హనుమాన్’ ‘సైంధవ్’ ‘నా సామి రంగ’ ‘కొత్త రంగుల ప్రపంచం’ ‘105 మినిట్స్’ ‘బిఫోర్ మ్యారేజ్’ ‘మూడో కన్ను’ ‘ప్రేమలో’ ‘ప్రేమ యుద్ధం’ ‘రామ్'(రాపిడ్ యాక్షన్ మిషన్) ‘కెప్టెన్ మిల్లర్’ వంటి సినిమాలు..!
ఇందులో సంక్రాంతి సినిమాలు అయిన ‘గుంటూరు కారం’ ‘హనుమాన్’ ‘సైంధవ్’ ‘నా సామి రంగ’ .. ల హవానే ఎక్కువగా నడిచింది అని చెప్పాలి. ముఖ్యంగా థియేటర్స్ విషయంలో ఈ సినిమాలు ఎక్కువగా చర్చనీయాంశం అయ్యాయి. ఇక బాక్సాఫీస్ వద్ద మాత్రం ‘హనుమాన్’ ‘గుంటూరు కారం’ పెద్ద నంబర్స్ చేశాయి. ‘హనుమాన్’ రూ.267 కోట్ల వరకు చేసింది అని అంచనా. ‘గుంటూరు కారం’ నెగిటివ్ టాక్ తో కూడా రూ.182 కోట్లు చేయడం అనేది విశేషంగా చెప్పుకోవాలి.
ఇక ‘నా సామి రంగ’ డీసెంట్ టాక్ తో రూ.37 కోట్ల వరకు గ్రాస్ ను కొల్లగొట్టింది. (Saindhav) ‘సైంధవ్’ నెగిటివ్ టాక్ వల్ల రూ.17 కోట్ల వరకు గ్రాస్ ను నమోదుచేసింది. మొత్తంగా కలుపుకుని రూ.503 కోట్ల గ్రాస్ వసూళ్లు సంక్రాంతి సినిమాలు రాబట్టడం జరిగింది. కానీ మిగిలిన 16 సినిమాలు పెద్దగా రాణించింది ఏమీ లేదు.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!