Nidhhi Agerwal: 3 ఏళ్ళ ‘నిధి’ అన్వేషణ.. ఫలితం దక్కేనా..?

నిధి అగర్వాల్ (Nidhhi Agerwal)  ఆల్మోస్ట్ 3 ఏళ్ళు ఆబ్సెంట్ అయ్యింది. 2022 లో వచ్చిన ‘హీరో’ ‘కలగ తలైవన్’ వంటి సినిమాల తర్వాత ఆమె నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే ఆమె ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) ‘ది రాజాసాబ్’  (The Rajasaab) వంటి పాన్ ఇండియా సినిమాల్లో ఛాన్సులు కొట్టింది. ఆ సినిమాలు షూటింగ్ చాలా డిలే అవ్వడం వల్ల.. ఆమె మరో సినిమాకు సైన్ చేయలేకపోయింది. ఓ హీరోయిన్ క్రేజ్లో ఉన్నప్పుడు.. 3 ఏళ్ళు టైం పోగొట్టుకోవడం అంటే సాధారణమైన విషయం కాదు.

Nidhhi Agerwal

2025 Very important for Nidhhi Agerwal (1)

చాలా వరకు కోట్లు పోగొట్టుకున్నట్టే..! అయినప్పటికీ ‘హరి హర వీరమల్లు’ ‘ది రాజాసాబ్’ సినిమాలు ఈమెను స్టార్ హీరోయిన్ గా నిలబెడతాయనే ఆసక్తి కనపరుస్తుంది ఈ అమ్మడు. అలా చూసుకుంటే 2025 ఈమెకి చాలా కీలకం అని చెప్పాలి. ఎందుకంటే ‘హరిహర వీరమల్లు’ మే 9న అంటే సమ్మర్ కానుకగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో ఆమె పంచమి అనే నర్తినిగా కనిపించబోతుంది.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  సినిమా అంటే.. హీరోయిన్ పై ఆడియన్స్ ఫోకస్ ఉంటుంది. సినిమా హిట్ అయ్యి ఈమె పాత్రకి కూడా మంచి మార్కులు పడ్డాయి అంటే.. గట్టెక్కినట్టే..! ఇక ప్రభాస్ తో చేస్తున్న ‘ది రాజాసాబ్’ హారర్ కామెడీ మూవీ. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా గట్టిగానే ఉంటాయట. నిధి సెకండ్ హీరోయిన్ గా చేస్తుంది.ధరణి ఠాకూర్ అనే పాత్రలో ఈమె కనిపించనుంది.

అయినప్పటికీ ఇందులో ఆమెకు ప్రభాస్ కలిసి డాన్స్ చేసే సాంగ్స్ ఉంటాయట. ‘కల్కి..’ (Kalki 2898 AD)  తర్వాత ప్రభాస్ (Prabhas)  నుండి వస్తున్న సినిమా కావడంతో ‘ది రాజాసాబ్’ పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇది కూడా హిట్ అయితే.. నిధి బాలీవుడ్లో కూడా మంచి ఛాన్సులు వస్తాయి. అప్పుడు ఆమె 3 ఏళ్ళ నిరీక్షణకి ఫలితం దక్కినట్టే అని చెప్పాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus