రామాయణం ఎన్నిసార్లు చూసినా తనివి తీరని రామ కావ్యం. భారతదేశంలో అనేక భాషలలో వందల సినిమాలు రామాయణం పై వచ్చాయి. ఇక తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ రామునికి వెండితెర రూపంగా వెలుగొందారు. రాముడు అంటే ఎన్టీఆర్ అన్నంతగా పేరుగాంచిన ఆ మహానటుడి పోలికలు, నైపుణ్యాలు పుణికి పుచ్చుకొని పుట్టిన జూనియర్ ఎన్టీఆర్ రామునిగా చేస్తే ఎలా ఉంటుంది. ఈ ఆలోచన దర్శకుడు గుణశేఖర్, నిర్మాత మల్లెమాల ఎమ్ ఎస్ రెడ్డి లకు 1995లో వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ తో వాళ్ళు రామాయణం తెరకెక్కించారు. అప్పటికి జూనియర్ ఎన్టీఆర్ వయసు 13 సంవత్సరాలు.
పిల్లలతో ప్రయోగాత్మకంగా ఈ చిత్రాన్ని బాలరామాయణంగా తెరకెక్కించారు. రాముడిగా జూనియర్ ఎన్టీఆర్ చేయగా, స్మిత మాధవ్ సీత పాత్రలో చేశారు. చిరు ప్రాయంలోనే తారక్ రాముడిగా ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేశారు. హావభావాలు, డైలాగ్ డెలివరీలో తాతను తలపించాడు. ఈ సినిమా విడుదలకు మూడు నెలల ముందు ఎన్టీఆర్ గుండె పోటుతో మరణించారు. దానితో రామునిగా వెండి తెరపై ఎన్టీఆర్ చూసిన వారు ఆయన మళ్ళీ పుట్టారు అనుకున్నారు. 1996 ఏప్రిల్ 14న ఈ చిత్రం విడుదల కాగా నేటికి 24ఏళ్ళు పూర్తిచేసుకుంది. డైరెక్టర్ గుణశేర్ కి ఇది మూడవ చిత్రం మాత్రమే.
మల్లెమాల ఎమ్ ఎస్ రెడ్డి ఫ్యాషన్ తో ఈ మూవీ తెరకెక్కించారు. బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ కేటగిరీ లో జాతీయ అవార్డు ఈ చిత్రం గెలుచుకుంది. ఇక అందరూ పిల్లలు కావడంతో సెట్లో అల్లరి అంతా ఇంతా కాదంట. జూనియర్ ఎన్టీఆర్ అల్లరి తట్టుకోవడం చాలా కష్టంగా ఉండేది అట. సీతా స్వయవరం సీన్ చిత్రీకరించాల్సి ఉండగా ఎన్టీఆర్ సీన్ కి ముందే శివ ధనుస్సు విరిచి వేశాడట. ఆ ధనస్సు లేకపోతే ఆ రోజు షూటింగ్ ఆగిపోయే పరిస్థితి. సెట్ లోకి వచ్చిన గుణశేఖర్ విరిగిపోయి ఉన్న ధనుస్సును చూసి ఎవరు చేశారు అని అడిగాడట. అది ఎన్టీఆర్ చేశాడని తెలుసుకొని సీరియస్ గా తిట్టి వేశాడట. లక్ష్మణుడు పాత్ర చేసిన వాడు, సీతకు లవ్ లెటర్ రాశాడట. ఆ విషయంలో కూడా ఎన్టీఆర్ బుక్ అయ్యాడట. ఇలాంటి చిలిపి సంఘటనలు ఈ సినిమా చిత్రీకరణలో ఎన్నో జరిగాయట.
Most Recommended Video
అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!