Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » పాతిక వసంతాల ‘అసెంబ్లీరౌడీ’

పాతిక వసంతాల ‘అసెంబ్లీరౌడీ’

  • June 4, 2016 / 09:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పాతిక వసంతాల ‘అసెంబ్లీరౌడీ’

కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు..నటుడుగా నాలుగు దశాబ్దాలను పూర్తి చేసుకుని తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ పేజీని క్రియేట్ చేసుకున్నారు. నటుడు 560కు పైగా సినిమాలు, నిర్మాతగా 60 చిత్రాలను నిర్మించిన ఈయన కెరీర్ లో మరచిపోలేని చిత్రాలు కొన్నే అటువంటి మైల్ స్టోన్ మూవీయే అసెంబ్లీ రౌడీ. మోహన్ బాబు అంటే ఏంటో తెలియజెప్పిన చిత్రం. ఈ సినిమా 1991, జూన్ 4న విడుదలై నేటికి సరిగ్గా పాతిక వసంతాలను పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ఆయన సినిమా గురించి విశేషాలను తెలియజేశారు…ఈ సందర్భంగా డా.మోహన్ బాబు మాట్లాడుతూ…తమిళ చిత్రం ఎనకు వేలై కడిచాచ్చి చిత్రం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. అల్లుడుగారు సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమాను తెలుగు రీమేక్ చేయడానికి హక్కులను తీసుకున్నాం. బి.గోపాల్ అప్పటికే స్టార్ డైరెక్టర్ గా ఉన్నాడు, తనకు ఫోన్ చేసి క్యాసెట్ పంపిస్తున్నాను. సినిమా చూడు, మనం సినిమా చేద్దాం అన్నాను. మా మధ్య ఉన్న స్నేహబంధంతో తను ఈ సినిమాకు డైరెక్టర్ గా వర్క్ చేయడానికి ఒప్పుకున్నాడు. అయితే ఈ సినిమాను ఓ సారి పరుచూరి బ్రదర్స్ కు సినిమా చూపిద్దాం అన్నారు. పరుచూరి గోపాలకృష్ణగారు సినిమా చూసి సూపర్ హిట్ అవుతుంది. తప్పకుండా చేద్దామని అన్నారు. సినిమాను స్టార్ట్ చేశాం. హీరోయిన్ గా అప్పుడే బొబ్బిలిరాజా చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన దివ్యభారతిని తీసుకోవాలనుకున్నాం. అయితే ఇండస్ట్రీలో మనం బాగుంటే చూడలేని చాలా మంది ఆ అమ్మాయిని హీరోయిన్ గా ఎందుకు తీసుకుంటారు. అని కూడా అన్నవారు ఉన్నారు. అలాగే నాకు, బి.గోపాల్ మధ్య అపోహలు క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు. అయితే వీటిని కాదని సినిమా చేశాం. స్వర్గం-నరకం చిత్రంలో నాతో హీరోయిన్ గా నటించిన అన్నపూర్ణను నా తల్లిపాత్ర కోసం అడిగాం. అలాగే నా తండ్రి పాత్ర కోసం ముందుగా రావుగోపాలరావుగారిని అనుకున్నాం కానీ ఆయన సెట్ కు నేను ఆలస్యంగా వస్తాను. నీకు ఇబ్బంది అవుతుంది. నీవు కోపడ్డతావు..అది మన మధ్య రిలేషన్ ను దెబ్బ తీసే ప్రమాదం ఉందని అన్నారు. సరేనని నేను జగ్గయ్యగారికి ఫోన్ చేసి ఆయన్ను కూడా సినిమా చూడమని క్యాసెట్ పంపాను. ఆయన కూడా నటించడానికి అంగీకరించారు. ఇక బి.గోపాల్ గురించి చెప్పాలంటే తనతో నాలుగు సినిమాకు కలిసి పనిచేశాను. ఏనాడు నాకు ఇది కావాలి అంటూ నిర్మాతలను ఇబ్బంది పెట్టే దర్శకుడు కాదు. ఏదైనా వద్దని అనిపిస్తే సున్నితంగా చెప్పేవాడు. సినిమాను 41 రోజుల్లోనే చిత్రీకరించాం. టైటిల్ విషయానికి వచ్చేసరికి అసెంబ్లీ రౌడీ ఏంటని, సినిమాను బ్యాన్ చేయాలని అప్పుడు అసెంబ్లీలో పెద్ద దుమారమే చేలరేగింది. సినిమా పోస్టర్స్, కటౌట్స్ ను తగలబెట్టడం చేశారు.

అయితే అన్నగారు నందమూరి తారక రామారావుగారు అండగా నిలబడ్డారు. అప్పటి స్పీకర్ ధర్మారావుగారు సినిమా చూసి సినిమా చాలా బావుందని అన్నారు. అడ్డంకులను దాటుకుని విడుదలైన ఈ చిత్రం 25 వారాల పాటు సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాం. ఇందులో హీరోగా విష్ణు నటిస్తారు’’ అన్నారు.
దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ ‘’అసెంబ్లీ రౌడీ చిత్రంలో మోహన్ బాబు గారు ఓ కొడుకుగా, ప్రేమికుడుగా, బాధ్యత గల యువకుడుగా, ఎమ్మెల్యేగా ఎన్ని వెర్షన్స్ లో డైలాగ్స్ చెప్పారో నాకు తెలుసు. షూటింగ్ టైంలో ఆయన నటనను అలా చూస్తూ ఉండిపోయాం. పరుచూరి బ్రదర్స్ గారు అద్భుతమైన డైలాగ్స్ రాశారు. ప్రతి సన్నివేశం అద్భుతంగా కుదిరింది’’ అన్నారు.

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ‘’సినిమా డైలాగ్స్ ను ఒకటిన్నర రోజులోనే పూర్తి చేశాం. తమిళం కంటే తెలుగులో స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. ఆ డైలాగ్స్ మోహన్ బాబు చెప్పిన తీరు ఇప్పటికీ హైలైట్ గా నిలిచిపోయింది. సినిమా విడుదలైన తర్వాత తన భార్యబిడ్డల సహా మా ఇంటికి వచ్చి ఇకపై నిన్ను అగ్రజ అని పిలుస్తానని అన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అలాగే పిలుస్తున్నారు. ఈ సినిమా మా అందరికీ మరచిపోలేని జర్నీ’’ అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Assembly Rowdy Movie
  • #Divya Bharti
  • #Mohan Babu

Also Read

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

related news

Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

Kavya Kalyan ram : బలగం బ్యూటీ కావ్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుందా..?

Kavya Kalyan ram : బలగం బ్యూటీ కావ్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుందా..?

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Mouli : ఎట్టకేలకు మౌళి తదుపరి ప్రాజెక్ట్ పై వీడిన సందిగ్దత.. పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తో ..!

Mouli : ఎట్టకేలకు మౌళి తదుపరి ప్రాజెక్ట్ పై వీడిన సందిగ్దత.. పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తో ..!

trending news

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

19 hours ago
Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

19 hours ago
Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

21 hours ago
Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

21 hours ago

latest news

Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

20 hours ago
Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

21 hours ago
Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

21 hours ago
Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్  ఉందా..!

Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్ ఉందా..!

23 hours ago
NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version