ఈ మధ్యనే ఓ తెలుగు సినిమాలో నటించిన మలయాళం స్టార్ హీరో… అక్కడికి వెళ్ళి ‘తెలుగు నిర్మాతలకి డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలీదు. ఊరికే మంచి నీళ్ళలా ఖర్చుపెట్టేస్తున్నారు. నన్ను సినిమాలో పూర్తిస్థాయి విలన్ గా తీసుకుని ఉండొచ్చు కదా. రోజుల లెక్కన రెమ్యూనరేషన్ చెల్లించి తీసుకున్నారు. 20 రోజుల షూటింగ్ కి నాకు 3 సినిమాలకి సరిపడా పారితోషికం చెల్లించారు’ అంటూ చెప్పుకొచ్చాడట. ఆ స్టార్ హీరో ఎవరు.. అతను ఏ తెలుగు నిర్మాతల్ని ఉద్దేశించి ఆ మాటలు అన్నాడు అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే..
అతను చెప్పింది నిజమే అని ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని బట్టి మీరు అర్ధం చేసుకుంటారు. విషయంలోకి వెళ్తే.. మహేష్ బాబు మేనల్లుడు గల్లా జయదేవ్ కొడుకు అశోక్ గల్లా ‘హీరో’ అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా పర్వాలేదు అనే టాక్ ను సంపాదించుకున్నప్పటికీ జనాలు థియేటర్లకు వెళ్ళలేదు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి రూ.20 కోట్లు బడ్జెట్ పెట్టారట నిర్మాతలు. అది వాళ్ళ సొంత బ్యానరే..కానీ ఎలా ఖర్చు చేయాలో కూడా తెలీకుండా పెట్టేసారు.
గల్లా అశోక్, హీరోయిన్ నిధి ల మధ్య ఓ సాంగ్ ఉంటుందట. `బుర్ర పాడౌతాదే` అంటూ సాగే ఆ పాటని రూ.2 కోట్లు పెట్టి చిత్రీకరించారట. కానీ సినిమా కథకి ఆ పాట అడ్డొస్తుందని దానిని తొలగించి రోలింగ్ టైటిల్స్ లో వేసారట. సినిమా అయిపోయాక ఆ పాటని చూస్తూ ఎవడు అక్కడ నిలబడతాడు. అంతేకాదు హీరోయిన్ నిధి అగర్వాల్ కి రూ.50 లక్షల పారితోషికం ఇచ్చి 50 రోజుల కాల్ షీట్లు తీసుకున్నారట.
కానీ ఆ 50 రోజుల కాల్షీట్లలో 20 రోజులు ఆ రూ.2 కోట్ల పాటకే వాడేసారట. చివరికి మరో 50 రోజుల కాల్షీట్లకి రెమ్యూనరేషన్ చెల్లిస్తేనే కానీ నిధి షూటింగ్ కు రాలేదట. ఇలా ఓ రూ.1 కోటి ఆ అమ్మాయికి, రూ.2 కోట్లు ఆ పాటకి వెళ్లిపోయాయి. ఇలాంటి వేస్టేజీలు చాలానే జరిగాయట. ఇలాంటి పాండమిక్ టైములో బడ్జెట్ ను కంట్రోల్లో పెట్టుకుని సినిమాలు చేయకపోతే చాలా కష్టమే కదా..!