RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌లో భారీ బడ్జెట్‌ పాట… ఎంతో తెలుసా?

రాజమౌళి సినిమా అంటేనే భారీతనం ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంటుంది. అలాంటిది ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ లాంటి అగ్ర హీరోలతో మల్టీస్టారర్‌ అంటే ఆ ‘భారీ’.. అతి ‘భారీ’గా మారిపోతుంది. ఈ క్రమంలో ఒక్కోసారి చిన్న సీన్‌కి, ఓ పాటకు కూడా భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే ఈ పాట ఎన్టీఆర్‌ మీదో, రామ్‌చరణ్‌ మీదో కాదట… ఆలియా భట్‌ మెయిన్‌గా సాగబోతోందట. ఈ పాటకు సుమారు మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని టాక్‌.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఆలియా భట్‌ పాత్ర చాలా కీలకం అని చెబుతూ వస్తోంది చిత్రబృందం. అయితే ఇటీవల విజయేంద్ర ప్రసాద్‌ కూడా ఇదే మాట అన్నాక… అంత స్పెషల్‌ ఏముంది అని అనుకుంటున్నారంతా. సరిగ్గా ఈ సమయంలో ఆలియా మీద ₹3 కోట్లు ఖర్చు పెట్టి ఓ పాట పెడుతున్నారు అని వార్తలొస్తున్నాయి. అంటే ఆమె సినిమాలో ఎంత స్పెషలో అర్థం చేసుకోవచ్చు. భారతీయ సినిమా చరిత్రలోనే ఇలాంటి పాట రావడం ఇదే తొలిసారి అని కూడా అంటున్నారు.

ఈ పాట కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో భారీ సెట్‌ రూపొందిస్తున్నారట. త్వరలో ఆలియా భట్‌ సెట్‌లో అడుగుపెట్టబోతోందట. అంతేకాదు ఈ పాటలో కాస్ట్యూమ్స్‌ కోసమే సుమారు కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నారని టాక్‌. పాన్‌ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను అక్టోబర్‌ 13, 2021 విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఈ నెల 15 నుంచి ప్రచార కార్యక్రమాలు జోరందుకోనున్నాయి. ఆ రోజు మేకింగ్‌ వీడియో విడుదల చేస్తారట.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus