బాహుబలి పూర్తి అయితే పెళ్లిపీటలు ఎక్కనున్న ఆ ముగ్గురు!

  • December 5, 2016 / 10:55 AM IST

అద్భుతాలు సృష్టించాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే లక్ష్యాన్ని అందుకోగలం. అలా ప్రతిఒక్కరూ కష్టపడ్డారు కనుకనే వెండి తెర కళాఖండం బాహుబలి రూపుదిద్దుకుంది. తెలుగువారి ప్రతిభని ప్రపంచానికి మరో సారి చాటింది. ఈ మూవీ కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన పెళ్లిని పోస్ట్ పోన్ చేశారు. రోజుకి 16 గంటలు కష్టపడి ఇండియన్ స్టార్ అయ్యారు. బాహుబలి కంక్లూజన్ కోసం ఇంకా పదిరోజుల పాటు శ్రమించనున్నారు. ఆయనతో పాటు స్వీటీ అనుష్క కూడా షూటింగ్ లో పాల్గొంటోంది. గత నెల వరకు కూడా దగ్గుబాటి రానా కఠోర డైటింగ్ తో బాడీని మూడేళ్లపాటు కంట్రోల్ ల్లో ఉంచారు.

వీరు ముగ్గురు వృత్తిపట్ల అంకితభావంతో పనిచేశారు. అందుకు పూర్తి ప్రతిఫలం వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాత అందుకోనున్నారు. అంతకు ముందే బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్పనున్నారు. పెళ్లి పీఠలపై కూర్చోనున్నారు. ప్రభాస్ కి వైజాక్ అమ్మాయితో పెళ్లిని ఫిక్స్ చేశారు రెబల్ స్టార్ కృష్ణం రాజు. తల్లి దండ్రులు చూపించిన బెంగళూర్ వ్యాపారితో ఏడు అడుగులు వేయడానికి అనుష్క సిద్ధంగా ఉంది. రానా ని కూడా ఓ ఇంటి వాడిని చేయడానికి సురేష్ బాబు సంబంధాలు చూస్తున్నారు. బాహుబలి కంక్లూజన్ షూటింగ్ కి దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి గుమ్మడి కాయ కొట్టేస్తే.. వీరి కల్యాణ గంటలు మోగడం మొదలవుతాయి. డైరక్టర్ పేకప్ చెప్పిన వెంటనే హీరో, హీరోయిన్, విలన్ పెళ్లిపనుల్లో బిజీ కానున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus