బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన తెలుగు ప్రొడ్యూసర్ SKN అందరికి సుపరిచితమే. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్ ఫుల్ లవ్ స్టోరీ ‘ బేబీ’. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లు కొల్లగొట్టటమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. ఆ సినిమా లో హీరోయిన్ గా నటించిన వైష్ణవి చైతన్య ఆ ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ దక్కించుకుంది. ఆ మూవీలో అవకాశమే తన తలా రాతను మార్చేసింది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.
అయితే ఆ అవకాశాన్ని అందించిన నిర్మాత SKN , తాను నిర్మించిన సినిమాలన్నిటిల్లో మొదటి నుంచి అవకాశం ఉన్నంతవరకు తెలుగు హీరోయిన్ల కే ఛాన్సులు ఇస్తూ ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. ఆ మధ్య తెలుగు హీరోయిన్లకు ఛాన్స్ ఇస్తే ఇప్పుడు పట్టించుకోవటం లేదని అంటూ SKN చేసిన కామెంట్స్ వైరల్ అవ్వగా వివరణ కూడా ఇచ్చారు ఆయన. రీసెంట్ గా ఆహా లో ఆయన నిర్మిస్తున్న ‘3 రోజెస్’ సిరీస్ డిసెంబర్ 12న OTT లో రిలీజ్ కి సిద్ధమైంది కానీ, బాలయ్య అఖండ 2 రిలీజ్ కారణంగా ‘3 రోజెస్’ సిరీస్ ను డిసెంబర్ 13కి మార్చుకున్నారు.
ఇది ఇలా ఉండగా ‘3 రోజెస్’ సిరీస్ కి సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ SKN మాట్లాడుతూ, తెలుగు హీరోయిన్లకు ఛాన్సెస్ ఇవ్వట్లేదు అని చాలా మంది చాలా వేదికలపై మాట్లాడుతూ వుంటారు అని, కానీ ఎవ్వరు ఆచరణలో పెట్టరు అని అన్నారు. తాను ఫ్యూచర్ లో నిర్మించబోయే తదుపరి చిత్రాలలో దాదాపుగా తెలుగు అమ్మాయిలనే హీరోయిన్లుగా ఎంపిక చేశామని తెలిపారు. దీంతో ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారగా SKN ని ఆదర్శముగా తీస్కొని మిగతా నిర్మాతలు కూడా తెలుగు అమ్మాయిలకి అవకాశాలు ఇస్తే బాగుంటుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.