OG: ‘ఓజీ’లో మూడు సర్‌ప్రైజ్‌లు.. రెండు ఊహించినా మూడోది కష్టమే!

‘ఓజీ’ సినిమా గురించి గత కొన్ని రోజులుగా దర్శకుడు సుజీత్‌, సినిమా టీమ్‌ మాట్లాడుతూ కొన్ని స్పెషల్స్‌ ఉన్నాయి.. సినిమాలో మీరు వాటిని చూడండి అంటూ లీకులు ఇస్తూ ఉన్నారు. ఈ క్రమంలో సుజీత్‌ గత సినిమా ‘సాహో’కు ఇది లింక్‌ చేస్తారని కొంతమంది ఫిక్స్‌ అయిపోయారు. సినిమా రిలీజ్‌కి కొన్ని గంటల ముందు సుజీత్‌ కూడా ఇదే మాట ఇంచుమించు చెప్పారు. ఇంకా చెప్పాలంటే ఆయన చెప్పింది రెండు సర్‌ప్రైజ్‌లు. అయితే ఆ రెండింటి కన్నా పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ ఎంజాయ్‌ చేసిన మరో సర్‌ప్రైజ్‌ ఉంది. అది ఇన్నాళ్లూ ఎవరూ ఊహించలేదు.

OG

సగటు ప్రేక్షకులకు ‘ఓజీ’ సినిమాలో రెండు సర్‌ప్రైజ్‌లే కనిపిస్తాయి. అయితే పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కి మాత్రం మూడు సర్‌ప్రైజ్‌లు. మూడో సర్‌ప్రైజ్లు ఇంటర్వెల్‌ ముందు చిన్న స్నాప్‌షాట్‌లా వచ్చి పోతే.. క్లైమాక్స్‌కి ముందు పూర్తి స్థాయిలో వస్తుంది. సినిమా చూసినవాళ్లకు అయితే అదేంటో అర్థమైపోతుంది. ‘ఓజీ’ కంటే ముందే ఇంతే హైప్‌తో, ఇంతే హైతో ఓ సినిమా వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర ఆశించిన విజయం అందుకోకపోగా.. తీరని బాధను అందించింది. అదే ‘జానీ’.

‘ఓజీ’ సినిమాలో పవన్‌ పట్టుకునే రెండు గన్స్‌ మీద జానీ సినిమా టైటిల్‌ లోగో ఉంటుంది. సెకండాఫ్‌లో అయితే ఓ గన్‌ పేరు అదే పెట్టారు. ఆ గన్‌ పట్టుకుని పవన్‌ ఫైరింగ్‌ స్టార్ట్‌ చేశాక ‘లెట్స్‌ గో జానీ’ పాటను రీమిక్స్‌ చేసి వాడారు. ఆ పాట ప్లే అవుతున్నంతసేపు థియేటర్లలో ఫ్యాన్స్‌ హడావుడి మామూలుగా లేదు. ఆనాటి రోజుల్ని సీనియర్‌ ఫ్యాన్స్‌ గుర్తు చేసుకుంటే.. ఆ బీట్‌ని ఇప్పటి ఫ్యాన్స్‌ ఎంజాయ్‌ చేశారు. ఇక మిగిలిన రెండు సర్‌ప్రైజ్‌ల విషయానికొస్తే..

ఒకటి సినిమా సీక్వెల్‌. సినిమా క్లైమాక్స్‌లో ఈ మేరకు టైటిల్‌ కార్డ్‌ కూడా వేశారు దర్శకుడు సుజీత్‌. ఇంకొకటి ‘సాహో’ సినిమాతో ఈ సినిమాకు లింక్‌. ఇప్పుడు రెండో పార్టులో జపాన్‌ విలన్‌, వాజీ సిటీ విలన్‌ను పవన్‌ ఎదుర్కొంటారు. ఆయనతోపాటు ప్రభాస్‌ కూడా కలిసొస్తాడేమో చూడాలి.

దే కాల్ హిమ్ ఓజీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus