’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్ పెద్దదే..!

యాంకర్ ప్రదీప్ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా సుకుమార్ శిష్యుడు మున్నా దూలిపుడి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. ‘ఎస్వీ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ఎస్వీ బాబు ఈ చిత్రాన్ని నిర్మించాడు. ‘నీలి నీలి ఆకాశం’ అనే ఒక్క పాటతో ఈ సినిమాకి బోలెడంత హైప్ ఏర్పడింది. ఇక ‘జి.ఏ2.పిక్చర్స్’ ‘యూ.వీ. క్రియేషన్స్’ వంటి బడా సంస్థలు ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడంతో అంచనాలు మరింత పెరిగాయనే చెప్పాలి. నిజానికి గతేడాదే ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా ఆగిపోయింది. ఇక ఈ మధ్యనే థియేటర్లు తెరుచుకోవడంతో జనవరి 29న విడుదల చెయ్యబోతున్నారు.

30 Rojullo Preminchadam Ela movie completes Censor Formalities2

ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను ఓసారి గమనిస్తే :

నైజాం  1.05 cr
సీడెడ్  0.55 cr
ఉత్తరాంధ్ర  2.01 cr
ఏపీ+తెలంగాణ (టోటల్)  4.50 cr

’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రానికి 4.5 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 5కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది.ఈ మధ్యనే ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన ట్రైలర్ కూడా పర్వాలేదనిపించింది. అయితే ప్రదీప్ సినిమాకి 5కోట్ల వరకూ షేర్ రావడం అంటే అంత ఈజీ ఏమీ కాదు. కానీ సినిమాకి కనుక పాజిటివ్ టాక్ వస్తే.. ఆ టార్గెట్ పెద్ద కష్టమేమి కాదనే చెప్పాలి.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus