30 ఇయర్స్ పృథ్వీ (Prudhvi Raj).. వైసీపీ పార్టీలో ఉండేవాడు. ఆ పార్టీలో ఉన్నన్ని రోజులు పవన్ కళ్యాణ్ పై (Pawan Kalyan), చిరంజీవి పై (Chiranjeevi) ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తర్వాత వైసీపీ పార్టీ నుండి ఆయన బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో సినిమాల్లో ఈయనకి ఎక్కువ ఆఫర్లు రాలేదు. ఇండస్ట్రీకి పెద్ద లాంటి చిరంజీవిపై ఈయన నెగిటివ్ కామెంట్లు చేయడం వల్ల.. ఫిలిం మేకర్స్ ఇతన్ని దూరం పెట్టారు. దీంతో ఆ విషయాన్ని గమనించి.. జనసేన, మెగా క్యాంప్ కి దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టారు పృథ్వీ.
Prudhvi Raj
ఈ క్రమంలో అప్పుడప్పుడు వైసిపికి ఇతను చురకలు అంటించడం.. అలాగే ఇతన్ని అడ్డం పెట్టుకుని ‘బ్రో’ (Bro) వంటి సినిమాల్లో వైసిపికి మేకర్స్ సెటైర్లు వేయడం జరుగుతుంది. నిన్న ‘లైలా’ (Laila) ఈవెంట్లో పృథ్వీ రాజ్ మరోసారి వైసీపీ పై సెటైర్లు వేశాడు. చివరికి 11 మేకలు మాత్రమే మిగిలాయి అంటూ పృథ్వీ వేసిన సెటైర్లు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.
30 ఇయర్స్ పృథ్వీ మాట్లాడుతూ.. ” నేను రాంచరణ్ గారి ఎంగేజ్మెంట్లో విశ్వక్ సేన్ (Vishwak Sen) గురించి వాళ్ళ నాన్న గారికి ఒక మాట చెప్పాను. భవిష్యత్తులో ఇతను స్టార్ అవుతాడు అని.’లైలా’ లో దర్శకుడు రామ్ నారాయణ్ గారు నాకు ‘మేకల సత్తి’ అనే పాత్ర ఇచ్చారు. అభిమన్యు సింగ్ కి ఆపోజిట్ గా ఆ పాత్ర ఉంటుంది. సినిమాలో ఒక సీన్లో ‘మేకల సత్తిని పట్టుకురండిరా’ అని అభిమన్యు సింగ్ నాకు ధమ్కీ ఇస్తాడు.
ఆ టైంలో నా దగ్గర 150 మేకలు ఉంటాయి. సినిమా క్లైమాక్స్ లో విలన్ గ్యాంగ్ నన్ను వదిలేసినప్పుడు నేను అడిగితే 11 మేకలే ఉన్నాయి అంటారు. ఇలా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు ఉంటాయి.” అంటూ చెప్పుకొచ్చారు. చిరంజీవి స్పీచ్ వీడియోల కంటే ఈ వీడియో మరింతగా వైరల్ అవుతుంది. వైసీపీ అభిమానులు పృథ్వీ కామెంట్స్ పై మండిపడుతూ ‘ఇతన్ని బ్యాన్’ చేయాలని కామెంట్స్ చేస్తున్నారు.