రామ్‌చరణ్ (Ram Charan) – బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పేరు ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ.. ‘పెద్ది’ (RC16 Movie) అనే వర్కింగ్ టైటిల్ ఉంది అనే విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమా కథ తారక్ (Jr NTR) దగ్గర ఉన్నప్పటి నుండి ఇదే పేరు వినిపిస్తోంది కూడా దీంతో మరో విషయం కూడా వినిపిస్తూ వచ్చింది. అదే ఈ సినిమా ఓ విలేజ్ బేస్డ్ స్పోర్ట్స్ నేపథ్యంలో ఉంటుంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సినిమా ఉంటుంది అనేది స్పష్టం.
అయితే, ఆర్‌సీ16 చిత్రం సినిమాటోగ్రాఫర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ కారణంగా పెద్ద డౌట్ వచ్చి పడింది. రామ్‌చరణ్ సినిమా కొత్త షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్ శివార్లలో షూటింగ్ జరుగుతోంది అని సమాచారం. ఈ విషయం చెబుతూ రత్నవేలు పోస్ట్ పెట్టారు. అందులో ఫ్లడ్ లైట్ లాంటి లైట్లు ఉన్నాయి. సినిమా షూటింగ్ భాగంగా వాటిని వాడుంటారు అనుకోవచ్చు. అయితే ఆయన ఆ ఫొటోతోపాటు రాసిన రైటప్‌లో ‘పవర్ క్రికెట్’ అని రాశారు.
దీంతో ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో సాగబోతోంది అని మీడియాలో వార్తలు వచ్చేశాయి. సినిమాలో రామ్‌చరణ్‌ను క్రికెటర్‌గా చూస్తామని.. ఓ స్టార్ క్రికెటర్ జీవితం ఆధారంగా ఈ సినిమా ఉండొచ్చు అంటూ రకరకాల కామెంట్లు పుట్టుకొచ్చాయి. అయితే ఇందులో నిజానిజాలెంత అనే ప్రశ్న మొదలైంది. ఈ క్రమంలో సినిమా ప్రచార బృందాన్ని కాంటాక్ట్ అయితే రత్నవేలు పోస్టులో సినిమా బ్యాక్‌డ్రాప్ ఉద్దేశం లేదు అని చెబుతున్నారు.
గ్రామీణ నేపథ్యంలో ఓ క్రీడా నేపథ్య కథాంశంతో తెరకెక్కనున్న సినిమా అని నిర్మాణ సంస్థ తొలుత నుండి చెబుతోంది. ఆ లెక్కన ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కే అవకాశమే లేదు అని చెప్పొచ్చు. ప్రస్తుతం రాత్రి వేళ క్రికెట్ టోర్నీ నేపథ్యంలో వచ్చే కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్న విషయం కరెక్టే కానీ.. సినిమా క్రికెట్ నేపథ్యంలో ఉంటుంది అని కాదు అంటున్నారు. చూద్దాం సినిమా వచ్చాక ఫుల్ క్లారిటీ వస్తుంది.