33 స్టూడియోలలో బాహుబలి 2 వీఎఫ్ఎక్స్ పనులు
- January 30, 2017 / 07:12 AM ISTByFilmy Focus
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరుల నటనకు విజువల్ ఎఫెక్ట్ తోడై ప్రేక్షకుడికి గొప్ప అనుభూతిని అందించాయి. ఆ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న బాహుబలి కంక్లూజన్ లోను మరింత అద్భుతాలను జక్కన్న ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 28 న రిలీజ్ కానుంది. ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉంది. అంతలోనే రాజమౌళి అనుకున్న అవుట్ పుట్ వస్తుందా?, పూర్తికాకుంటే సమయాన్ని పొడిగిస్తారా? అంటూ కొంతమంది సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాలన్నింటినీ ‘బాహుబలి–2’ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్ కమల్ కణ్ణన్ పటాపంచలు చేశారు.
అనుకున్న రోజే థియేటర్లలోకి బాహుబలి 2 వస్తుందని స్పష్టం చేశారు. ‘‘మన దేశంలోని అతిపెద్ద వీఎఫ్‌ఎక్స్ స్టూడియోలలో ‘బాహుబలి: ద కంక్లూజన్’ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జరుగుతోంది. పదిహేను నెలలుగా ప్రపంచవ్యాప్తంగా 33 కంటే ఎక్కువ స్టూడియోలలో అనుభవజ్ఞులైన నిపుణులు ‘బాహుబలి–2’ కి అదనపు హంగులు జోడించడంలో బిజీగా ఉన్నారు. ఏప్రిల్ 28 రిలీజ్ అయ్యే విధంగా మా టీమ్ లోని ప్రతి ఒక్కరూ శ్రమిస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో సందేహం అవసరం లేదు” అని కమల్ కణ్ణన్ స్పష్టం చేశారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















