Bigg Boss 5 Telugu: మూడోవారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్లేనా..?

బిగ్ బాస్ హౌస్ లో ఉమాదేవి ఎలిమినేషన్ తర్వాత హౌస్ మేట్స్ అందరూ ఖచ్చితంగా జాగ్రత్తపడతారు. ఎందుకంటే, కుండబద్దలు కొట్టినట్లుగా తన మనసులో మాటల్ని చెప్పేసింది ఉమాదేవి. అందరికీ సజెన్స్ కూడా ఇచ్చింది. అయితే, సండేరోజు దెయ్యం టాస్క్ ఆడించినపుడు హౌస్ మేట్స్ ఈసారి నామినేషన్స్ లో ఎవర్ని టార్గెట్ చేయబోతున్నారు అనేది స్పష్టంగా అర్ధమైంది. సిరిని ఐదుగురు హౌస్ లో దెయ్యం అంటూ స్టిక్కర్స్ అంటించారు. దీన్ని బట్టీ చూస్తే ఈసారి మూడోవారం నామినేషన్స్ లో సిరి ఖచ్చితంగా ఉంటుందని అర్ధమవుతోంది.

ఇక ఈవారం నామినేషన్స్ కూడా బిగ్ బాస్ హౌస్ ని హీటెక్కిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఈసారి హౌస్ మేట్స్ ఒకరినొకరు చేసుకున్న నామినేషన్స్ లో 11 మంది ఉన్నట్లుగా చెప్తున్నారు. ఇందులో మరి ఎంతమందిని బిగ్ బాస్ నామినేట్ చేయబోతున్నాడు అనేది చూడాలి. ఈ 11మందిలో విజె సన్నీ, సిరి , ఆర్జే కాజల్, శ్వేతావర్మ, లోబో, నటరాజ్ మాస్టర్, షణ్ముక్ జస్వంత్, అనీమాస్టర్, హమీద, జెస్సీ, రవి ఉన్నట్లుగా తెలుస్తోంది.

మరి ఈ లిస్ట్ లో ఫైనల్ గా నామినేట్ ఎవరు అవుతారు ? డేంజర్ జోన్ లో ఎవరు ఉంటారు అనేది ఆసక్తికరం. షణ్ముక్ – సిరి కలిసి గేమ్ ఆడుతున్నారని ఇప్పటికే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన సరయు చెప్పింది. అలాగే, ఉమాదేవి కూాడ ఇదే మాట చెప్పింది. ఇలాంటి టైమ్ లో వీరిద్దరి గేమ్ ఈ వీక్ ఎలా ఉండబోతోందనేది బిగ్ బాస్ లవర్స్ లో అసక్తిని కలిగిస్తోంది. అదీ మేటర్.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus