ఒకప్పుడు కన్నడ సినిమా అంటే ఎక్కువగా రీమేక్ లే ఉంటాయి అనే ముద్ర ఉండేది. తెలుగులో కన్నడ సినిమాలు డబ్ అయినా జనాలు పట్టించుకునేవారు కాదు. ఒక్క ఉపేంద్ర సినిమాలు మాత్రమే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను మెప్పించేవి. అర్జున్ వంటి హీరోలు మన సినిమాలనే రీమేక్ చేసి.. మళ్ళీ తెలుగులో డబ్ చేసేవారు. కన్నడ మేకర్స్ కు రైట్స్ కొనుగోలు చేసుకోకుండా రీమేక్ చేసుకునే వెసులుబాటు ఉంది.
అందుకే కన్నడ సినిమాలను తెలుగు జనాలు పట్టించుకునేవారు కాదు.కానీ దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘కె.జి.ఎఫ్’ తో ఆ ముద్రను చెరిపేశాడు. 2018 చివర్లో రిలీజ్ అయిన కె.జి.ఎఫ్ మూవీ ప్రేక్షకులను ఏ రేంజ్లో మెప్పించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదిలా ఉండగా 2022 లో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన కన్నడ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) కె.జి.ఎఫ్ చాప్టర్ 2 : ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ కి కొనసాగింపుగా రూపొందిన ఈ మూవీ ఏప్రిల్ లో సమ్మర్ కానుకగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. రాఖీ బాయ్ ఆటిట్యూడ్ కు, డైలాగులకు,హీరో ఎలివేషన్లకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.తెలుగు రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా డబ్బింగ్ సినిమాల్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’.
2) 777 చార్లీ : రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి నటించిన ఈ మూవీ కూడా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉన్నా.. ప్రతీ ఒక్కరినీ ఈ మూవీ మెప్పించే విధంగా ఉంటుంది.
3) విక్రాంత్ రోణ : సుదీప్ హీరోగా నటించిన ఈ మూవీ కూడా తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సహజంగా అనిపించే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి.
4) కాంతారా : శనివారం నాడు(అక్టోబర్ 15న) రిలీజ్ అయిన ఈ మూవీ కూడా డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కన్నడ నేటివిటీ ఉన్నప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ మూవీ బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే ప్రేక్షకులు థియేటర్లో నుండి బయటకు వచ్చాక కూడా వెంటాడుతోంది.