Movies: నైజాంలో భారీ హైప్ తెచ్చుకున్న 5 మీడియం రేంజ్ సినిమాలు ఇవే..!

ఈ రోజుల్లో స్టార్ హీరో కాకుండా టైర్ 2 రేంజ్ హీరోల సినిమాలకు రిలీ‌జ్‌కి ముందు హైప్ రావడం, జనాలను థియేటర్లకు రప్పించడం అంటే ఏదో మ్యాజిక్ జరగాలి.. ప్రోమోలతో, పాటలతో సినిమాలో కంటెంట్ ఉంది అనిపించేలా చేయాలి.. స్టార్లు జనాల్లోకి ప్రమోట్ చేయాలి.. ముఖ్యంగా యూత్ ఆడియన్స్‌ని ఆకట్టుకోవాలి.. కాలేజీలకి బంక్ కొట్టి వచ్చి మరీ బ్లాక్ బస్టర్ చేయాలంటే వాళ్ల వల్లే అవుతుంది.. అలా సినిమా వ్యాపారానికి గుండె కాయ లాంటి పెద్ద ప్రాంతం నైజాం ఏరియాలో పాండమిక్ తర్వాత భారీ హైప్ తెచ్చుకుని, తొలిరోజు భారీ వసూళ్లు (షేర్) రాబట్టిన ఐదు చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం..

1) ఉప్పెన..

మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ – బెంగుళూరు బ్యూటీ కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమైన ‘ఉప్పెన’ ఫస్ట్ డే నైజాంలో ఊపు ఊపింది.. రాక్ స్టార్ డీఎస్పీ ఇచ్చిన సాంగ్స్ అన్నీ చార్ట్ బస్టర్ కావడంతో మంచి హైప్ వచ్చింది.. నైజాంలో తొలిరోజు రూ. 3.08 కోట్ల షేర్ రాబట్టింది..

2) లవ్ స్టోరీ..

యువసామ్రాట్ నాగ చైతన్య – బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అద్భుతమైన ప్రేమకథ ‘లవ్ స్టోరీ’ పాండమిక్ తర్వాత యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ని హాళ్లకు రప్పించింది.. ఫస్ట్ డే.. రూ. 3.06 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది..

3) ది వారియర్..

రామ్ పోతినేని – కృతి శెట్టి జంటగా.. తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి చేసిన బైలింగ్వువల్ ఫిలిం ‘ది వారియర్’ మొదటి రోజు రూ. 1.95 కోట్లు తెచ్చిపెట్టింది..

4) దాస్ కా ధమ్కీ..

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఫస్ట్ టైం డ్యుయల్ రోల్ చేస్తూ.. సెకండ్ టైమ్ డైరెక్ట్ చేసిన ‘దాస్ కా ధమ్కీ’ కి భారీ హైప్ వచ్చింది.. బాలయ్య – జూనియర్ ఎన్టీఆర్ ప్రమోట్ చేయడం ప్లస్ అయ్యింది.. ఈ మూవీ నైజాంలో రూ. 90 లక్షలు రాబట్టింది..

5) దసరా..

నేచురల్ స్టార్ నాని ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం9 (Movies) ‘దసరా’ తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.. ప్రోమోలు, పాటలు ఊపు ఊపడంతో సినిమా త్వరగా జనాల్లోకి వెళ్లిపోయింది.. నైజాంలో ఫస్ట్ డే ఏకంగా రూ. 6.75 కోట్ల వసూళ్లతో అదిరిపోయే రికార్డ్ సొంతం చేసుకున్నాడు.. సీనియర్, టైర్ 1 ప్లేసులో ఉన్న హీరోలకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డ్ నెలకొల్పాడు..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus