బిగ్ బాస్ హౌస్ లో అనూహ్యంగా రెండోవారమే షకీల ఎలిమినేట్ అయిపోయింది. నిజానికి షకీల బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోతోంది అనే విషయం తెలిసినప్పటి నుంచీ చాలామంది నా ఓటు షకీలాకే అనే కామెంట్స్ చేశారు. కానీ, ఇప్పుడు ఆ ఓట్లు పడకే షకీల ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. షకీలకి టేస్టీ తేజకి ఉన్నంత క్రేజ్ కూడా సోషల్ మీడియాలో లేదా ? అలాగే రతిక – శోభాశెట్టికి ఉన్నంత క్రేజ్ కూడా లేదా ? ఇంకా గౌతమ్ కి ఉన్నంత ఫాలోయింగ్ కూడా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. మరి ఎందుకు ఎలిమినేట్ అయ్యింది మనం 5 కారణాలు డిస్కస్ చేస్కున్నట్లయితే,
నెంబర్ – 1
ఫస్ట్ వీక్ నుంచీ షకీల బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపేషన్ లో వెనకబడింది. తన ఏజ్ అయిపోయినట్లుగా ఇంకేం చేస్తా అన్నట్లుగా కొద్దిగా డిస్సపాయింట్ తోనే గేమ్ ని స్టార్ట్ చేసింది. ఇంట్లో కంటే కూడా స్మోకింగ్ రూమ్ లోనే డిస్కషన్స్ ఎక్కువ పెట్టింది. షకీలమ్మగా అవ్వాలని ఉందని హౌస్ లోకి అడుగు పెట్టి హౌస్ మేట్స్ తో కలిసిపోయింది కానీ, హౌస్ లో అందరినీ మెప్పించలేకపోయింది.
నెంబర్ – 2
ఫస్ట్ వీక్ లో షకీల నామినేషన్స్ లోకి వచ్చినా సేఫ్ అయ్యింది. అంతేకాదు, అక్కడ తను థామినికంటే, అలాగే ప్రిన్స్ యావార్ కంటే కూడా ఎక్కువ ఓట్లుని సంపాదించింది. కానీ, ఈవారం వెనకబడిపోయింది. ఫస్ట్ వీక్ లో కూడా షకీలని ప్రిన్స్ నామినేట్ చేశాడు. నువ్వు ప్రిన్స్ అయితే మీ నాన్న కింగా అన్న మాటలకి ప్రిన్స్ నామినేట్ చేశాడు. అలాగే, బెడ్ విషయంలో కూడా షకీల అన్న మాటలు తీస్కోలేక ప్రిన్స్ సెకండ్ వీక్ కూడా నామినేట్ చేశాడు. రెండుసార్లు ప్రిన్సే షకీల పాలిట విలన్ అయ్యాడు. ఇక సెకండ్ వీక్ తన గేమ్ లో సత్తాని చూపించలేకపోయింది. అయినా కూడా హౌస్ మేట్స్ సాయంతో పవర్ అస్త్రా వరకూ వచ్చింది. కానీ అడియన్స్ మాత్రం ఓటు వేయలేదు.
నెంబర్ – 3
సోషల్ మీడియాలో షకీలకి ఫాలోయింగ్ లేదు. అంతేకాదు, సెకండ్ వీక్ ఎగ్రెసివ్ గా గేమ్ ని స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ వీక్ సేఫ్ అయ్యాను కదా అని ఈవారం కూడా సేఫ్ అయిపోతాం అనుకుంది. అందరూ నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారో లెక్కలు వేసుకుని మరీ గేమ్ ఆడారు. అలాగే, వారి మద్దతు కూడా ఇచ్చారు. కానీ షకీల ఈవిషయాన్ని కంప్లీట్ గా మిస్ అయ్యింది. స్ట్రాటజికల్ గా గేమ్ ఆడలేకపోయింది.
నెంబర్ – 4
ఈవారం షకీలతో పాటు ఉన్న కంటెస్టెంట్స్ అందరూ గట్టోళ్లే. అందరూ ఏదో ఒక కంటెంట్ ఇస్తూ హైలెట్ అవ్వాలనే చూశారు. అందుకే ఏదో ఒక విషయంలో ఆర్గ్యూ చేయడమో , పుటేజ్ ఇవ్వడమో చేశారు. రతిక అయితే చాలా ఓవర్ కూడా చేసింది. కానీ, షకీల విషయంలో అది కనిపించలేదు. కనీసం శివాజీలాగా మైండ్ గేమ్ కూడా ఆడలేదు. అందుకే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.
నెంబర్ – 5
షకీల కిచెన్ లో పార్టిసిపేషన్ లో , హౌస్ వర్క్ లో మునిగిపోయింది. ఎవరి గేమ్ ని అబ్జర్వ్ చేయలేకపోయింది. కనీసం స్ట్రాంగ్ ప్లేయర్స్ సపోర్ట్ అయినా నిలవలేదు. అలా లాజిక్స్ వర్కౌట్ చేసినా ఆడియన్స్ కి కొద్దిగా అయినా కనెక్ట్ అయ్యేది. ఈవారం హైలెట్ అయ్యే సీన్స్ ఏది కూడా షకీల నుంచీ కనిపించలేదు. అందుకే, టెలికాస్ట్ లో కూడా కొద్దిగా మాత్రమే బాగం అయ్యింది. అందుకే, ఎలిమినేట్ అవ్వక తప్పలేదు.
ఏది ఏమైనా తన సినిమాల ముద్రనుంచీ ఇప్పుడు బిగ్ బాస్ కి రావడం అనేది షకీలకి ప్లస్ అయ్యిందనే చెప్పాలి. ఇది తన కెరియర్ ని ఖచ్చితంగా ముందుకు తీస్కుని వెళ్లే అవకాశమే కనిపిస్తోంది. అదీ మేటర్