కరోనా నేపథ్యంలో థియేటర్లకు నిబంధనలు అమలు

  • April 20, 2021 / 12:03 PM IST

ఈ మధ్య తెలుగు సినిమాలు వరుసగా వాయిదా పడుతుంటే… ఏదో జరగబోతోంది అని మన సినిమా జనాలు, ప్రేక్షకులు అనుకున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే థియేటర్ల విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏదో నిర్ణయం తీసుకునేలా ఉన్నాయి అంటూ వార్తలు వచ్చాయి. అయతే ప్రభుత్వ నిర్ణయం కాబట్టి… పెద్దగా పుకార్లు రాలేదు. కానీ 50 శాతం ఆక్యుపెన్సీ విధానమైతే తీసుకొస్తారని చాలామంది ఊహించారు. ఇప్పుడు అదే నిజమైంది. ఆంధ్రప్రదేశ్‌ థియేటర్ల నిర్వహణ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ కచ్చితం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇద్దరు ప్రేక్షకుల మధ్య ఒక సీటు గ్యాప్‌ కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే తొలి కరోనా వచ్చిన వెళ్లిపోతున్న సమయంలో థియేటర్లు రన్‌ అయినట్లు ఇప్పుడు రన్‌ అవ్వాలన్నమాట. దీంతో పూర్తిగా సినిమా హాళ్లను బంద్‌ చేస్తారు అంటూ వస్తున్న పుకార్లకు కాస్త కామా పడింది అనుకోవచ్చు. అయితే ఇంకా కేసులు పెరిగితే ఈ 50 శాతం నిబంధన కూడా తీసేసి, మొత్తం థియేటర్లు మూసేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మరోవైపు తెలంగాణలో కూడా 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన వస్తుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన హైకోర్టు థియేటర్ల నిర్వహణ తదితర విషయాల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. జన సంచారం తగ్గడానికి ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నించింది. దీంతో త్వరలో తెలంగాణలో కూడా సినిమా థియేటర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారట. మరోవైపు సినిమాల షూటింగ్‌లు కూడా ఒక్కొక్కటిగా నిలిపేస్తున్నారని టాక్‌. చిత్రబృందంలో కొంతమందికి కరోనా సోకుతుండటంతో షూటింగ్‌లు ఆగిపోతున్నాయి.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus