హిందీ సినిమాలకు దేశవ్యాప్తంగా మార్కెట్ ఉంటుంది. అందులోనూ ఖాన్ల సినిమాలంటే ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ వాళ్ల సినిమాలు కూడా ఒక రీజనల్ మూవీ ముందు దిగదుడుపే అనిపిస్తున్నాయి. ఆ సినిమా మన ‘బాహుబలి’యే కావడం విశేషం.
ఇండియాలో ఇప్పటిదాకా మరే సినిమాకు లేని స్థాయిలో దీనికి బిజినెస్ జరుగుతుండటం విశేషం. ఇంకా విడుదలకు ఆరు నెలలు సమయం ఉండగానే అన్ని ఏరియాల్లోనూ బిజినెస్ ఓ కొలిక్కి వచ్చేయడం.. దాదాపు రూ.500 కోట్లు నిర్మాతల ఖాతాలో పడేలా కనిపిస్తుండటం విశేషం. కేవలం హిందీ.. తమిళం శాటిలైట్ రైట్స్ ద్వారా మాత్రమే ‘బాహుబలి’ రూ.100 కోట్లకు పైగా సంపాదించడం విశేషం.