Star Hero: బాలీవుడ్ స్టార్ హీరోని తక్కువ రేటుకే పట్టేశారే?

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా తెలుగు సినిమాల్లో నటిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తమ సినిమాలను పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో దర్శకనిర్మాతలు పక్క భాషల్లోని స్టార్ హీరోలను కూడా తమ సినిమాల్లో ఎంపిక చేసుకుంటూ ఉంటారు. బాలీవుడ్ మార్కెట్ పెద్దది కాబట్టి.. అక్కడ క్రేజ్ ఉన్న హీరోలను కూడా తమ సినిమాల్లోకి ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు. ‘ఆర్.ఆర్.ఆర్’ లో అజయ్ దేవగన్ , ‘సైరా’ లో అమితాబ్ బచ్చన్ వంటి స్టార్లు నటించారు.

‘ఆదిపురుష్’ లో సైఫ్ అలీ ఖాన్ కూడా నటించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇక మరో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కూడా ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2 ‘ తర్వాత సౌత్ మార్కెట్ పై కన్నేశాడు. ‘డబుల్ ఇస్మార్ట్’ తో టాలీవుడ్లోకి కూడా అడుగుపెడుతున్నాడు సంజయ్ దత్. పాన్ ఇండియా ప్రాజెక్టు కాబట్టి సంజయ్ ఇమేజ్ తో బాలీవుడ్లో ఈ సినిమాకి మంచి మార్కెట్ ఏర్పడుతుంది.

‘డబుల్ ఇస్మార్ట్’ కోసం సంజయ్ దత్ ఏకంగా 60 రోజుల కాల్షీట్లు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇందుకోసం సంజయ్ అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా .. అక్షరాలా రూ.15 కోట్లు.ఓ రకంగా ఇది భారీ రెమ్యూనరేషన్ అని చెప్పలేం. ఎందుకంటే 10 , 15 రోజుల కాల్ షీట్లు ఇచ్చి రూ.20 కోట్లు పట్టుకుపోతున్న బాలీవుడ్ స్టార్లు ఉన్నారు. పైగా దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా బాలీవుడ్ జనాలను ఈజీగా అట్రాక్ట్ చేసి టాలీవుడ్ కి తీసుకురాగలడు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus