అల్లు అర్జున్ “నా పేరు సూర్య” సినిమాకి ఈ నష్టం ఊహించలేదు!

సినిమా రంగంలో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. కొన్ని సార్లు తొందరపడాలి. మరికొన్ని సార్లు నిదానంగా ఆలోచించాలి. ఇందులో కుడి ఎడమైతే మాత్రం కోట్లు నష్టపోవాల్సి ఉంటుంది. అల్లు అర్జున్ తాజా చిత్రం “నా పేరు సూర్య” సినిమా విషయంలో ఇలాగే జరిగింది. రచయితగా హిట్స్ అందుకున్న వక్కంతం వంశీ తొలిసారి మెగాఫోన్ పట్టి.. దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ ఇంపాక్ట్ తోనే బెస్ట్ ఇంపాక్ట్ అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నానక్ రామ్ గూడ లోని రామానాయుడు స్టుడియోస్ లో జరుగుతోంది.  పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో ఇంటర్వెల్ బ్యాంగ్ కు సంబంధించిన ఫైట్ సీక్వెన్స్ ను బన్నీపై షూట్ చేస్తున్నారు. శ్రీధర్ లగడపాటి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్, శేఖర్ లు సంగీతమందిస్తున్నారు.

బన్నీ సినిమాలకు బాలీవుడ్ మార్కెట్ లో మంచి గిరాకీ ఉంది. విశాల్, శేఖర్ లు తోడవ్వడంతో నా పేరు సూర్య సినిమా స్టార్ట్ కాగానే మంచి ఆఫరే వచ్చింది. 12 కోట్లకు హిందీ డబ్బింగ్ రైట్స్ కావాలంటూ ఓ సంస్థ ముందుకొచ్చింది. మంచి డీల్ అని నిర్మాత ఆనందంగానే రైట్స్ ఇచ్చేశారు. ఇది ఫస్ట్ లుక్ రిలీజ్ కి ముందే జరిగిపోయింది. కానీ ఇప్పుడు నాపేరు సూర్యకు మరింత క్రేజ్ ఏర్పడింది. రీసెంట్ గా ఓ బడా సంస్థ హిందీ డబ్బింగ్ వెర్షన్ కోసం 18 కోట్లను ఆఫర్ చేస్తూ డీల్ పంపింది. తమ చిత్రానికి ఉన్న వ్యాల్యుని తక్కువగా అంచనా వేశామని చిత్ర బృందం ఇప్పుడు బాధపడుతోంది. కొన్ని రోజులు ఆగి ఉంటే ఆరు కోట్ల నష్టం రాకుండా ఉండేదని భావిస్తున్నారు. ఇక  నుంచి ప్రీ రిలీజ్ బిజినెస్ ని అలోచించి చేయాలనీ డిసైడ్ అయ్యారు. అను ఇమ్యానుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 27 న రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus