ఆరో వారం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ఆసక్తికరంగా మారాయి. ఒకరి ముఖంపై ఒకరు ఫోమ్ రాసి మరీ నామినేట్ చేయమని బిగ్ బాస్ ఆదేశించాడు. దీంతో హౌస్ మేట్స్ రెచ్చిపోయి మరీ లెక్కలు వేస్తూ లాజిక్స్ వర్కౌట్ చేశారు. శని , ఆదివారం జరిగిన పాయింట్స్, టాస్క్ లో జరిగిన పొరపాట్లని ఎత్తిచూపుతూ ఒక్కొక్కళ్లు నామినేట్ చేసుకున్నారు. ఇందులో భాగంగా రేవంత్ ఆదివారం తనకి ఇచ్చిన సామెతల ట్యాగ్ ల గురించి మాట్లాడుతూ సుదీప ఇంకా బాలాదిత్యలని నామినేట్ చేశాడు. మిగతా హౌస్ మేట్స్ లో సుదీపకి, కీర్తికి, శ్రీసత్య మద్యలో కూడా ఆర్గ్యూమెంట్స్ హీటెక్కిపోయాయి.
చంటి ఎలిమినేషన్ తర్వాత హౌస్ మేట్స్ గేమ్ పూర్తిగా మారిపోయింది. కెప్టెన్ గా రేవంత్ ఈవారం సేఫ్ అవుతాడు కాబట్టి ఎవ్వరూ నామినేట్ చేయలేకపోయారు. లేదంటే మాత్రం ఖచ్చితంగా ఈవారం నామినేషన్స్ ని ఫేస్ చేసేవాడే. మరోవైపు చంటి ఎలిమినేషన్ కి గీతు కారణమనే పాయింట్స్ కూడా రైజ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక బాలాదిత్యకి గీతుకి మద్యలో టఫ్ వార్ నడిచింది. ఈవారం నామినేషన్స్ లోకి మొత్తం 9మంది వచ్చినట్లుగా సమాచారం తెలుస్తోంది. ఈవారం ఫోమ్ నామినేషన్స్ హౌస్ ని హీటెక్కించాయి.
బాలాదిత్య, గీతు, ఆదిరెడ్డి, సుదీప, శ్రీహాన్, కీర్తి, రాజశేఖర్, శ్రీసత్య, మెరీనా వీళ్లు నామినేట్ అయినట్లుగా సమాచారం. ఈసారి కెప్టెన్ కి ఇచ్చిన స్పెషల్ పవర్ వల్ల ఇనయసుల్తానా సేవ్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే, ఇక్కడ లాస్ట్ టైమ్ కెప్టెన్ గా ఉన్న కీర్తిని హౌస్ మేట్స్ తన కెప్టెన్సీ కారణం చేత నామినేట్ చేశారు. అలాగే, గీతుకి కూడా ఎక్కువ ఓట్లు వచ్చినట్లుగా సమాచారం. ఇక ఆదిరెడ్డికి, మెరీనా అండ్ రోహిత్ ఇద్దరికీ ఒక రేంజ్ లో ఆర్గ్యూమెంట్స్ అయ్యాయి. అలాగే, ఫైమా ఇంకా సుదీప ఇద్దరూ కూడా నువ్వెంత అంటే నువ్వెంత్ అనుకునే రేంజ్ వరకూ ఆర్గ్యూమెంట్స్ జరిగాయని తెలుస్తోంది. మరో మేటర్ ఏంటంటే.,
రేవంత్ ఇంకా సుదీప ఇద్దరూ కూడా ఎమోషనల్ అయినట్లుగా తెలుస్తోంది. అలాగే, అరిచి అరిచి సుదీపకి గొంతు పోయింది. ఎవరి కెప్టెన్సీ లో అయినా సరే రేషన్ మేనేజర్ గా ఉన్న సుదీప హౌస్ మేట్స్ తో చాల్ స్ట్రిక్ట్ గా ఉంది. ఇదే తన తప్పు అయ్యిందని చాలాసేపు ఎమోషనల్ అయ్యిందట. అంతేకాదు, సుదీపకి ఫైమాకి మద్యలో కూడా హీటెడ్ ఆర్గ్యూమెంట్స్ అయినట్లుగా సమాచారం. మొత్తానికి ఈవారం నామినేషన్స్ హౌస్ మేట్స్ లెక్కలు మారుస్తున్నాయి. మరి వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.