పూజా హెగ్డేని 3 ఏళ్ళ నుండి ప్లాపులు వెంటాడుతున్నాయి. ‘రాధే శ్యామ్’ తో మొదలైన ప్లాపుల జర్నీ ఇంకా ఆగలేదు. ‘బీస్ట్’ ‘ఆచార్య’ ‘సర్కస్’ ‘కిసీ క భాయ్ కిసీ క జాన్’ ‘రెట్రో’ వంటి సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. పూజ కెరీర్ ను మార్కెట్ ను దెబ్బతీశాయి. వరుస ఆఫర్లు ఉన్న టైంలో ‘గుంటూరు కారం’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలను ఆమె దూరం చేసుకుంది. తర్వాత బాలీవుడ్లో చేసిన సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.
దీంతో ఆమెకు ఆఫర్లు కరువయ్యాయి. తెలుగు నుండి ఆమెకు ఒక్క ఛాన్స్ కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు ఒక ఛాన్స్ వచ్చింది అని అంటున్నారు. దుల్కర్ సల్మాన్ సినిమాలో ఆమెకు హీరోయిన్ ఛాన్స్ లభించింది అంటున్నారు. కానీ అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
ఒకవేళ ఆ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయినా.. పూజా హెగ్డేకి ఒకప్పటి రేంజ్లో పారితోషికం వస్తుందని చెప్పలేము. గతంలో ఆమెకు రూ.3 కోట్ల పైనే పారితోషికం అందింది. ఇదిలా ఉంటే.. తమిళంలో పూజా హెగ్డేకి మంచి ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె విజయ్ ‘జన నాయకుడు’ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
అలాగే ఇటీవల ‘కూలి’ సినిమాలో మౌనిక అనే స్పెషల్ సాంగ్ చేసింది. ఈ పాట కోసం పూజా హెగ్డే ఏకంగా రూ.70 లక్షలు పారితోషికంగా అందుకుందట. పూజా స్టార్ స్టేటస్ కి ఇది చిన్న అమౌంట్ అనే చెప్పాలి. కానీ ఇప్పుడు ఆమె ఉన్న పొజిషన్లో కూడా ఒక్క పాటకి అంత అందుకుంది అంటే చిన్న విషయం కాదు.