2023 సంవత్సరానికి గాను జాతీయ అవార్డులను ఇప్పుడే ప్రకటించారు. 71వ నేషనల్ అవార్డ్స్ లిస్ట్ కొందర్ని సంతోషపెట్టి, కొందర్ని బాధపెట్టి, ఇంకొందర్ని మాత్రం షాక్ కు గురయ్యేలా చేసింది. మన తెలుగు చిత్రసీమ 71వ నేషనల్ అవార్డ్స్ లో ఏకంగా 7 అవార్డులు దక్కించుకోవడం విశేషం. ఉత్తమ తెలుగు చిత్రంగా నిలవడం విశేషంగా చెప్పుకోవచ్చు. అలాగే హనుమాన్ అత్యుత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ మరియు ఉత్తమ గ్రాఫిక్స్ సినిమాగా రెండు అవార్డులు అందుకోగా, బేబీ సినిమా ఉత్తమ స్క్రీన్ ప్లే మరియు ఉత్తమ గాయకుడు కేటగిరీల్లో రెండు అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ బాలనటిగా సుకుమార్ తనయ సుకృతి “గాంధీ తాత చెట్టు”కు అవార్డ్ దక్కించుకోగా, బలగం చిత్రం ఉత్తమ గేయ రచయిత కేటగిరీలో “ఊరు పల్లెటూరు” పాటకు అవార్డ్ దక్కించుకుంది, ఆ పాటకి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఈ విధంగా తెలుగు సినిమా 7 అవార్డులు గెలుచుకోవడం అనేది మామూలు విషయం కాదు.
అలాగే.. తమిళ, మలయాళ, హిందీ ఇండస్ట్రీలు కూడా మంచి స్థాయిలో అవార్డులు అందుకున్నాయి. ముఖ్యంగా అందర్నీ విశేషంగా ఆకట్టుకున్న “పార్కింగ్” చిత్రానికి ఉత్తమ తమిళ చిత్రం మరియు భాస్కరన్ ను ఉత్తమ సహాయ నటుడు అవార్డు ప్రకటించడం అందరికీ ఆనందాన్ని ఇవ్వగా.. 2023లో విడుదలైన మోస్ట్ కాంట్రవర్షియల్ సినిమా “ది కేరళ స్టోరీ”కి పలు కేటగిరీల్లో అవార్డు రావడం అనేది ఎవరూ హర్షించలేకపోయారు. ఆ విషయం పక్కన పెట్టేస్తే.. చాలామంది డిజర్వింగ్ ఆర్టిస్టులకు ఈ 71వ నేషనల్ అవార్డ్స్ లో గుర్తింపు లభించింది అని చెప్పాలి.
ఈ అవార్డ్స్ ఫుల్ లిస్ట్ క్రింద చూడండి..
Animal (Re-Recording) – Special Mention – M.R.Rajakrishnan
Best Telugu Film – Bhagavanth Kesari
Best Tamil Film – Parking
Best Punjabi Film – Godday Godday Chaa
Best Odia Film – Pushkara
Best Marathi Film – Shyamchi Aai
Best Malayalam Film – Ullozhukku
Best Kannada Film – Kandeelu
Best Hindi Film – Kathal
Best Gujarati Film – Vash
Best Bengali Film – Depiction Fridge
Best Assamese Film – Rongatapu 1982
Best Action Choreography – Hanuman (Nandu & Prudhvi)
Best Choreography – Rocky Aur Rani Kii Prem Kahaani ( Vaibhavi Merchant)
Best Lyrics – Balagam (Ooru Palletooru) – Kasarla Shyam
Best Music Direction – Vaathi (GV Prakash Kumar)
Best BGM – Animal (Harshavardhan Rameshwar)
Best Make up – Sam Bahadur (Shrikant Desai)
Best Costume Designer – Sam Bahadur (Sachin Lovalekar, Divvya Gambhir & Nidhhi Gambhir)
Best Production Design – 2018 (Mohandas)
Best Editing – Pookkaalam (Midhun Murali)
Best Sound Design – Animal (Sachin Sudhakaran & Hariharan Muralidharan)
Best Screenplay – Baby (Sai Rajesh Neelam) & Parking (Ram Kumar Balakrishnan)
Best Dialogue Writer – Sirf Ek Bandaa Kaafi Hai (Deepak Kingari)
Best Cinematography – The Kerala Story (Prasantanu Mohapatra)
Best Female Playback Singer – Shilpa Rao (Chaliya)
Best Male Playback Singer – PVNS Rohit (Baby – Premistunna)
Best Child Artist – Sukruthi Veni Bandreddi For Telugu (Gandhi Tatha Chettu) & Kabir Khandare For Marathi (Gypsy) & Treesha Thosar, Shrinivas Pokale, Bhargav For Marathi (Naal 2)
Best Supporting Actress – Urvashi – (Ullozhukku) & Janki Bodiwala – (Vash)
Best Supporting Actor – Vijaya Raghavan (Pookkaalam) & Muthupettai Somu Bhaskar (Parking)
Best Actress – Rani Mukherji (Mrs Chatterjee Vs Norway)
Best Actor – Jawan (Shah Rukh Khan) & Vikram Massey (12th Failm)
Best Director – Sudipto Sen (The Kerala Story)
Best Film in AVGC – Hanuman (Jetty Venkat Kumar)
Best Children’s Film – Naal 2 (Sudhakar Reddy Yakkanti)
Best Feature Film Promoting National, Social & Environmental Values – Sam bahaur
Best Popular Film – Rocky Aur Rani Kii Prem Kahaani (Karan Johar)
Best Debut Film – Aatma Pamphlet (Ashish Bende)
Best Feature Film – 12th Fail (Vidhu Vinod Chopra)