ఈ మధ్య కాలంలో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో 777 చార్లీ ఒకటనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఈ సినిమా గురించి జోరుగా చర్చ జరుగుతోంది. శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో నాన్ యాక్షన్ జానర్ లో తెరకెక్కి 100 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించిన సినిమా 777 చార్లీ కావడం గమనార్హం. కథ, కథనం కొత్తగా ఉండటంతో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది.
కరోనా థర్డ్ వేవ్ తర్వాత కొత్త కథ, కథనంలతో తెరకెక్కిన సినిమాలు మాత్రమే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటూ ఉండటం గమనార్హం. 777 చార్లీ సినిమాకు కన్నడ నుంచి 75 కోట్ల రూపాయల కలెక్షన్లు రాగా ఇతర ఏరియాల నుంచి 26 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాగా 777 చార్లీ నిలవడంతో రక్షిత్ శెట్టి అభిమానులు సంతోషిస్తున్నారు.
తెలుగులో సైతం ఈ మధ్య కాలంలో రొటీన్ కథలతో తెరకెక్కిన సినిమాలకు హిట్ టాక్ వస్తున్నా ఆ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకోవడంలో ఫెయిలవుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ నెల 29 నుంచి వూట్ సెలెక్ట్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుండటం గమనార్హం. వూట్ సెలెక్ట్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని ఓటీటీ అనే సంగతి తెలిసిందే.
20 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించడం గమనార్హం. కుక్క పిల్ల టైటిల్ రోల్ లో ప్రేక్షకులను హత్తుకునే ఎమోషనల్ సీన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమా విడుదలైన 50 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండటం గమనార్హం. ఇప్పటికీ చాలా థియేటర్లలో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.