కెజిఎఫ్2 టీజర్: మాస్ కా బాప్ వచ్చాడు..!

కేజీఎఫ్ చాప్టర్ 2 టీజర్ వచ్చేసింది. ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న టీజర్ యష్ బర్త్ డే స్పెషల్ అంటూ రిలీజ్ చేసింది మూవీ టీమ్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్స్ షాట్స్ తో పిచ్చిలేపుతోంది ఈటీజర్. ఇలా వచ్చిందో లేదో అలా ట్రెండింగ్ వన్ లో దూసుకుపోతోంది. దాదాపు 25 మిలియన్ వ్యూస్ చేరువలో ఉంది అంటే టీజర్ కెపాసిటీని అర్ధం చేసుకోవచ్చు. ఈ టీజర్ లో మనం కొన్ని అంశాలని నోటీస్ చేసినట్లయితే,

1. స్టార్టింగ్ చూసిటనట్లయితే, మదర్ సెంటిమెంట్ తోనే టీజర్ ని స్టార్ట్ చేశారు. చాప్టర్ వన్ లో సీన్స్ ని మరోసారి గుర్తుచేశారు. 0.26 సెకన్స్ దగ్గర ‘హిస్టరీ టెల్స్ హజ్’ అంటూ వాయిస్ ఓవర్ స్టార్ట్ అయ్యింది. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చింది ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్. ఇక్కడే మనకి కేజీఆఫ్ ఎలివేషన్ ని చూపించారు. అంతేకాదు, చాప్టర్ వన్ లో గరుడ నుంచుని ఉన్న ఇంటిని కూడా చూపించారు.

2. 0.32 సెకన్స్ దగ్గర మనం ఆర్టిస్ట్ రావ్ రమేష్ ని నోటీస్ చేయచ్చు. అంతేకాదు, అక్కడ పోలీస్ వ్యాన్స్ వెళ్తుంటే బ్యాక్ గ్రాండ్ లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ ఆఫీస్ కనిపిస్తోంది. అంటే గరుడ హత్య కేసు సిబిఐ విచారణకి వచ్చిందని అర్ధమవుతోంది.

3. 0.34 సెకన్స్ దగ్గర పోలీస్ వ్యాన్స్ , సఫారీ కార్లు అన్నీ కేజీఎఫ్ లోకి వస్తున్నాయి. పవర్ ఫుల్ పీపుల్ అన్న వాయిస్ రాంగానే పార్లమెంట్ లో ఎంపిగా అలానాటి బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండెన్ నడిచివస్తున్న షాట్స్ చూడచ్చు.

4. 0.39 సెకన్స్ దగ్గర పోలీసు బలగం కేజీఎఫ్ ని ఆక్రమిస్తున్నట్లుగా షాట్స్ కనిపిస్తున్నాయి. 0.42 సెకన్స్ దగ్గర ఆర్టిస్ట్ ఈశ్వరీ రావ్ మనకి కనిపిస్తోంది. అక్కడే బ్యాక్ గ్రౌండ్ లో హీరోయిన్ ని కూడా మనం నోటీస్ చేయచ్చు.

5. 0.52 సెకన్స్ దగ్గర మనం నోటీస్ చేసినట్లయితే, బైక్ పైన వచ్చిన దుండగులు హీరో రాఖీ భాయ్ ని ఎటాక్ చేస్తున్నారు. ఈ షాట్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది.

6. 0.58 సెకన్స్ దగ్గర అధీరా గెటప్ ని బ్యాక్ సైడ్ నుంచి చూపించారు. ఈ అధీరాగా మనకి బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, టీజర్ లో ఎక్కడా కూడా అధీరా గెటప్ లో సంజయ్ దత్ ని రివీల్ చేయలేదు. 1.03 సెకన్స్ దగ్గర చూసినట్లయితే, చేతిలో కత్తి పట్టుకుని పవర్ ఫుల్ పోస్టర్ లో మాత్రం వెనక నుంచి సంజయ్ దత్ కనిపిస్తున్నాడు.

7. 1.17 సెకన్స్ దగ్గర గన్ ని లోడ్ చేస్తూ ఊరమాస్ లుక్ లో హీరో యష్ ని భీభత్సమైన ఎలివేషన్ తో చూపించారు. పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చి గన్ లోడ్ చేసి పేలుస్తూ స్టేషన్ ముందున్న జీప్స్ ని అమాంతం గాల్లోకి లేపాడు రాఖీ భాయ్. ఈ సీన్ ఎలివేషన్ టీజర్ కే హైలెట్ గా నిలిచింది.

8. ఫైనల్ గా 1.44 సెకన్స్ దగ్గర మిషన్ గన్ కాలిన కడ్డీతో స్టైల్ గా సిగరెట్ ని వెలిగిస్తూ మాస్ కా బాప్ అన్నట్లుగా లుక్ ఇచ్చాడు హీరో యష్. ఆ తర్వాత అమ్మ చేతిలో చేయి వేస్తూ నీకు ఇచ్చిన ప్రామిస్ ని నిలబెట్టుకుంటున్నాను అంటూ చెప్పకనే చెప్తున్నాడు హీరో.

ఓవర్ ఆల్ గా టీజర్ చూస్తుంటే యాక్షన్ సినిమా ప్రేమికులకి పండగలాగానే కనిపిస్తోంది. అందరి అంచనాలకి మించి ఈ సినిమా ఉంటుందని టీజర్ చూస్తుంటే అర్ధమవుతోంది. అదీ విషయం.


2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus