ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. కరోనా కారణంగా గతేడాది వేడుక నిర్వహించని విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా కరోనా పరిస్థితులు ఉండటంతో వేడుకను రెండు ప్రాంతాల్లో నిర్వహించారు. సెలబ్రిటీలు మాత్రమే వేడుకకు హాజరయ్యారు. ఈ 93వ అకాడమీ పురస్కారాల్లో ‘నో మ్యాడ్‌లాండ్’ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. మిగిలిన వివరాలు ఇవీ… ఉత్తమ నటుడిగా ‘ది ఫాదర్’ సినిమాలో నటనకుగానున ఆంటోనీ హాప్కిన్స్ ఎంపికయ్యాడు. ‘నో మ్యాడ్ ల్యాండ్’లో నటనకుగాను ఫ్‌రాన్సిస్ మెక్ డోర్‌మాండ్ ఉత్తమనటిగా నిలిచింది.
ఇదే సినిమాకుగాఉ ఉత్తమ దర్శకత్వ పురస్కారాన్ని క్లోవ్‌చావ్ నిలిచారు. ‘మినారీ ’ సినిమాకు గాను యూ జుంగ్ యున్ ఉత్తమ సహాయనటి పురస్కారం దక్కించుకుంది. ఇక ఉత్తమ సహాయనటుడుగా డేనియల్ కలుయా నిలిచాడు. ‘జుదాస్ అండ్ ది బ్లాక్ మెసయ్య’ సినిమాకు ఈ పురస్కారం అందుకున్నాడు. ఇక ఉత్తమ విదేశీ చిత్రంగా డెన్మార్క్‌కు చెందిన‘అనదర్ రౌండ్’ఎంపికైంది. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్‌గా ‘సోల్’ నిలిచింది.
‘మ్యాంక్’ సినిమాకుగాను ఎరిక్ ఉత్తమ సినిమాటోగ్రఫీ పురస్కారం పొందాడు. ‘టెనెట్’లో పనితననానికి ఆండ్రూ జాక్సన్, డేవిడ్ లీ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ పురస్కారం దక్కించుకున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
Most Recommended Video
ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!