Rhea Chakraborty: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసు.. రియా చక్రవర్తికి ఊరట!

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో నటి రియా చక్రవర్తికి పెద్ద ఊరట దక్కింది. ఆమె, ఆమె కుటుంబ సభ్యులపై సీబీఐ జారీ చేసిన లుక్‌ అవుట్‌ సర్క్యూలర్‌ను బాంబే హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు ద్విసభ్య ధర్మాసనం గురువారం నాడు అదేశాలు జారీ చేసింది. అంతేకాదు సుప్రీం కోర్టులో అప్పీల్‌ చేసేందుకు నాలుగు వారాలపాటు ఈ ఆర్డర్‌పై స్టే విధించాలన్న సీబీఐ తరఫు న్యాయవాది విజ్ఞప్తిని కూడా న్యాయ స్థానం తిరస్కరించింది.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ 2020 జూన్‌ 14న ముంబయిలోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. అయితే అది ఆత్మహత్య కాదంటూ ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు రియా చక్రవర్తి, ఆమె కుటుంబంపై ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఈ విషయంలో కేసు కూడా పెట్టారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ బ్యాంకు ఖాతా నుండి రూ. 15 కోట్లు బదిలీ చేసుకున్నారని అతడి తండ్రి కేకే సింగ్‌ ఆరోపించారు.

దీంతో ఈ కేసులో మనీలాండరింగ్‌ జరిగినట్లు భావించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రంగంలోకి దిగింది. విచారణలో భాగంగా రియా చక్రవర్తిని ఈడీ ప్రశ్నించింది. కొన్ని పరిణామాల తర్వాత ఈ కేసును సీబీఐకు అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. మరోవైపు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌కు రియా మాదకద్రవ్యాలు ఇచ్చారనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తి జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

ఈ క్రమంలోనే (Rhea Chakraborty) రియా, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తి, తండ్రి ఇంద్రజిత్‌ చక్రవర్తి విదేశాలకు వెళ్లకుండా సీబీఐ లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ కూడా జారీ చేసింది. దీంతో, ఇటీవల రియా బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో ఆమె త్వరలో విదేశాలకు వెళ్తారు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి సుశాంత్‌సింగ్‌ కేసు ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ విషయంలో సుశాంత్‌ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

యూట్యూబ్లో వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ నమోదు చేసిన పాటల లిస్ట్
ఆ విషయంలో నేను బాధ పడలేదు.. ఉపాసన కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus