కోలీవుడ్‌లో ‘పన్ను’పోటు ఎక్కువవుతోంది. మొన్నటికిమొన్న ఇద్దరు యువ హీరోలు ఈ పోటుతో ఇబ్బందిపడగా… ఇప్పుడు మూడో హీరోకు ఆ సెగ తగిలింది. దీంతో మరోసారి ‘స్టార్లు’ సినిమా వరకేనా అనే చర్చ మొదలైంది. ఈసారి ‘పన్ను’పోటు ఎదుర్కొంటున్న హీరో సూర్య. అవును మన ‘సింగం’ సూర్యనే. అయితే ఈ కేసు ఇప్పటిది కాదు సుమారు 11 ఏళ్లు అంటే 2010నాటిది. అప్పుడు సూర్య ఇల్లు, ఆఫీసులో సోదాలు నిర్వహించినప్పుడు ఐటీ అధికారులు కొన్ని లెక్క లేని ఆస్తులు గుర్తించారు.
ఆ లెక్కలేని ఆస్తులకు సంబంధించి పన్ను చెల్లించాలంటూ ₹3.12 కోట్లు జరిమానా విధించారు. అయితే ఆ మొత్తాన్ని చెల్లించనంటూ సూర్య అప్పట్లోనే మద్రాస్ హైకోర్టుకు వెళ్లాడు. ఈ కేసు విషయంలో వాదోపవాదాలు పూర్తయ్యాయి. ఇరు పక్షాల వాదనలు విన్న జడ్జి సుబ్రమణ్యం పిటిషన్‌ను తోసిపుచ్చారు. సూర్య పన్ను తిరిగి చెల్లించాల్సిందే అని న్యాయస్థానం తేల్చి చెప్పింది. అయితే ఆ పన్నుకు సంబంధించిన వడ్డీ నుంచి మినహాయిస్తున్నట్టు తీర్పు చెప్పింది. దీంతోపాటు పన్ను చెల్లింపును తప్పించుకునేందుకు చూడటం సూర్యకు సబబు కాదని వ్యాఖ్యానించినట్లు సమాచారం.
సినిమా హీరోలు అందరికి ఆదర్శంగా ఉండాలి… అంతేకానీ ఇలా పన్ను చెల్లించకుండా ఉండకూడదు అని న్యాయస్థానం సూచించిందట. పన్ను చెల్లించే విషయంలో తమిళ నటులు ఉదాసీనంగా ఉంటారని మనం గతంలో చూశాం. అప్పట్లో రజనీకాంత్, మొన్నామధ్య విజయ్, ధనుష్.. ఇలా స్టార్ నటులు పన్ను మినహాయించాలని కోర్టు మెట్లెక్కి మొట్టికాయలు వేయించుకుంటున్నారు.
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!