బిగ్‌బాస్‌ సీజన్ – 4 ఫైనల్ లో బిగ్ ట్విస్ట్..!

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన ప్రతి ఒక్క పార్టిసిపెంట్ టైటిల్ విన్నర్ అవ్వాలనే గేమ్ ఆడతాడు. ఒకవైపు హౌస్ మేట్స్ ని మచ్చిక చేసుకుంటూ, మరోవైపు ఆడియన్స్ కి చేరిక అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే వాళ్లు గేమ్ ని ఎంత జెన్యూన్ గా ఆడాం ? ఎంత జెన్యూన్ గా ప్రవర్తించాం..? తోటి హౌస్ మేట్స్ తో ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది చూపిస్తూ ఉంటారు. ఇలా ఒకవైపు నామినేషన్స్ లోకి రాకుండా హౌస్ మేట్స్ ని కాకాపడుతుంటే, బిగ్ బాస్ మాత్రం టాస్క్ లు ఇస్తూ అందరిని శత్రువులుగా మార్చేస్తుంటాడు. అయినా కూడా టాస్క్ ల్లో గెలవాలని ప్రతి ఒక్క పార్టిసిపెంట్ ఆరాటపడుతుంటాడు. ఇప్పుడు ఈసీజన్ లో కూడా ఇదే జరుగుతోంది.

ఫస్ట్ లో ఈసీజన్ లోకి వచ్చిన పార్టిసిపెంట్స్ గురించి ఎవరికీ తెలియపోయినా ఇప్పుడు మాత్రం అందరి గురించి తెలుసుకున్నారు. అందుకే 9వ వారం లేదా, 10వ వారం రేస్ టు ఫినాలే టాస్క్ అనేది పెట్టాలని చూస్తున్నాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ఎవరు గెలిస్తే వాళ్లు ఫినాలే టిక్కెట్ ని సొంతం చేసుకుంటారు.

ఇప్పుడున్న సిట్యువేషన్ లో ఏదైనా మొండి టాస్క్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా హారిక ,అరియానా, అఖిల్, సోహైల్, మెహబూబ్ రేస్ లో ముందుకు ఉంటారు. అదే ఫిజికల్ టాస్క్ అయితే మాత్రం మెహబూబ్ అండ్ అఖిల్ ఈ ఇద్దరి మద్యన గట్టి పోటీ ఉంటుంది. మరి ఈ టాస్క్ లో ఎవరు గెలుస్తారు..? ఎవరు ఈ ఫినాలే టిక్కెట్ ని కైవసం చేస్కుంటారు అనేది ఆసక్తికరం. మరో మేటర్ ఏంటంటే, ఈసారి ఈటాస్క్ లో పెద్ద ట్విస్ట్ ఉండబోతోంది అని చెప్తున్నారు. ఆసక్తికరమైన టాస్క్ గా దీన్ని డిజైన్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. అదీ మేటర్.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus