ఎన్టీఆర్ సినిమాకి అదిరిపోయే టైటిల్.. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా..!

2018 డిసెంబర్ 21న ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ (KGF) అనే సినిమా వస్తుంది అని చాలా మందికి తెలీదు. అప్పటికి ఆ హీరో ఎవరో? దర్శకుడు ఎక్కడివాడో? తెలుగు ప్రేక్షకులకు తెలియదు. ఓ సాదా సీదా డబ్బింగ్ సినిమాలనే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంత సైలెంట్ గా వచ్చినప్పటికీ ఈ సినిమా ఓ అండర్ డాగ్..లా అందరినీ సర్ప్రైజ్ చేసింది. మాస్ సినిమాని ఇలా కూడా తీయవచ్చా? ఇంటర్వెల్, క్లైమాక్స్ వంటివి ఇలా కూడా డిజైన్ చేయొచ్చా?

Jr NTR

అంటూ తెలుగు ఫిలిం మేకర్స్ అంతా ఆశ్చర్యపోయేలా ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ మేకింగ్ ఉండటం విశేషంగా చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) , హీరో యష్ (Yash) తెలుగులో కూడా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. మెయిన్ తెలుగు ప్రేక్షకులు యష్ పోషించిన రాకీ భాయ్ ను బాగా ఓన్ చేసుకున్నారు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

ఇప్పుడు ఆ రాకీ భాయ్ ను గుర్తుచేసే విధంగా ఓ టైటిల్ ను డిజైన్ చేసి ఎన్టీఆర్ (Jr NTR)  సినిమా కోసం పెట్టబోతున్నారనేది లేటెస్ట్ టాక్. విషయంలోకి వెళితే.. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. దానితో సమాంతరంగా ‘వార్ 2’ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇవి పూర్తయ్యాక నెల్సన్ (Nelson Dilip Kumar) దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.

‘సితార ఎంటర్టైన్మెంట్’ సంస్థపై నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఆ చిత్రాన్ని నిర్మించనున్నారు. దీనికి ‘రాక్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తాజా సమాచారం. ఎన్టీఆర్ ఎనర్జీకి, అతని ఇమేజ్ కి ఈ టైటిల్ కరెక్ట్ గా సెట్ అవుతుంది అని మేకర్స్ భావిస్తున్నారట. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇక నెల్సన్ ప్రస్తుతం రజినీకాంత్ (Rajinikanth) తో ‘జైలర్ 2’ చేస్తూ బిజీగా గడుపుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus