Bigg Boss Show: బిగ్ బాస్ షో సీజన్7 ను అలా ప్లాన్ చేశారా.. ఏం జరిగిందంటే?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్7 తెలుగు త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ ఇప్పటికే పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. బిగ్ బాస్ షో సీజన్7 లో వర్ష పాల్గొననున్నారని అనధికారికంగా క్లారిటీ వచ్చేసింది. త్వరలో ఒక పెద్ద షోలో కనిపిస్తానంటూ వర్ష కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే సమయంలో బిగ్ బాస్ షో సీజన్7 తమిళ వెర్షన్ కూడా మొదలుకానుంది.

అయితే బిగ్ బాస్ షో సీజన్7 (Bigg Boss) తమిళంలో కామన్ ఉమెన్ ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది. కోయంబత్తూరుకు చెందిన షర్మిల బిగ్ బాస్ షో సీజన్7లో పాల్గొనాలని తమిళనాట ట్రెండ్ అవుతుండగా ఆమె బిగ్ బాస్ షోలో కనిపించే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. ఆగష్టు నెలలోనే తమిళ బిగ్ బాస్ మొదలుకానుందని తెలుస్తోంది. తొలి మహిళా బస్ డ్రైవర్ షర్మిలకు కమల్ మద్దతు కూడా ఉంది.

ఉద్యోగంలో ఉన్న సమయంలో డ్రైవర్ షర్మిల బాగానే పాపులర్ కాగా కొన్ని కారణాల వల్ల ఆమె ఉద్యోగాన్ని కోల్పోయారు. షర్మిల బస్సు నడిపే విధానం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఎంతోమందికి షర్మిల అదర్శంగా నిలవడం గమనార్హం. ఉద్యోగం కోల్పోయిన షర్మిలకు తర్వాత రోజుల్లో కమల్ హాసన్ కారును బహుమతిగా ఇచ్చారు. కమల్ కల్చరల్ సెంటర్ ద్వారా కమల్ హాసన్ షర్మిలకు ఈ బహుమతిని ఇవ్వడం జరిగింది.

రాబోయే రోజుల్లో షర్మిల ఎంతోమందికి ఉపాధి కల్పించాలని కమల్ ఆకాంక్షించారు. బిగ్ బాస్ షో సీజన్7లో షర్మిల ఎంట్రీ ఇస్తే మాత్రం బిగ్ బాస్ షో సీజన్7 తమిళ్ వెర్షన్ హిట్ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్ షో సీజన్7 తమిళ్ వెర్షన్ ఎప్పటినుంచి ప్రసారమవుతుందో అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus