సురేఖ,ఉపాసన-లావణ్య త్రిపాఠిల్లో ఉన్న కామన్ పాయింట్ అదేనా..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు మొదలవనున్నాయి. వీరి వివాహం ఇటలీలోని టస్కానీలో గ్రాండ్ గా జరగనుంది. కొన్ని రోజుల క్రితమే రామ్ చరణ్ భార్య ఉపాసన, కూతురుతో కలిసి ఇటలీ వెళ్లారు. అక్కడ సోదరుడి పెళ్ళి పనులను చూసుకుంటున్నారు. వరుణ్, లావణ్య పెళ్లి నవంబర్ 1న జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మెగా కుటుంబంతో పాటు, లావణ్య ఫ్యామిలీ మరియు సన్నిహితులు ఇటలీకి వెళ్లారు. కొద్ది రోజులుగా వీరి పెళ్లి గురించిన వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల నిశ్చితార్ధం నాగబాబు నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య గ్రాండ్ గా జరిగింది. వీరి వివాహం నవంబర్ 1న ఇటలీలో వైభవంగా జరగబోతుంది. అక్టోబర్ 30 నుండి మెహందీ, సంగీత్ ఈవెంట్లు జరగనున్నాయని తెలుస్తోంది. త్వరలో మెగా కోడలుగా మారబోతున్న లావణ్య త్రిపాఠి గురించి వార్తలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలిలోని సురేఖ, ఉపాసన మరియు లావణ్య త్రిపాఠిల మధ్యనున్న కామన్ పాయింట్ గురించిన వార్త ఒకటి వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ సహాయం చేయడంలో ముందు ఉంటారనే విషయం తెలిసిందే. ఆమెలానే రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు కూడా సహాయం చేసే మనస్తత్వం ఉందనే విషయం ఎన్నోసార్లు వార్తల్లో నిలిచింది. ఉపాసన పలు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారనే సంగతి తెలిసిందే.

వీరిద్దరి లాగానే (Lavanya) లావణ్య త్రిపాఠికి కూడా హెల్పింగ్ చేసే అలవాటు ఉందని తెలుస్తోంది. తన సంపాదనలో 50 శాతం పేదలకు పంచుతుందట. ఆమె చేసిన గొప్ప పనుల గురించి పెద్దగా చెప్పుకోదని తెలుస్తోంది. ఈ ముగ్గురులో ఉన్న కామన్ క్వాలిటీ ప్రస్తుతం వైరల్ అవుతోంది. వారి హెల్పింగ్ నేచర్ ను నెటిజెన్లు ప్రశంసిస్తున్నారు. లావణ్య వరుణ్ తేజ్‌తో సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడపాలని విష్ చేస్తున్నారు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus