Bhumika and Pooj Hegde: ఆ ముగ్గురు స్టార్‌ హీరోల విషయంలో ఇది గమనించారా!

Advertisement

ఒక హీరోతో నటించిన హీరోయిన్‌, మరో హీరోతో నటించడం కొత్తేం కాదు. చాలామంది నాయికలు ఇలా అందరూ హీరోలతో నటిస్తూ ఉంటారు. అయితే ఆ నటించడంలోనూ ఓ పద్ధతి, ఓ సిరీస్‌, ఓ లెక్క ఉంటే ఆసక్తే కదూ. అలాంటి ఫీట్లు కొంతమంది హీరోయిన్లకు అప్పుడప్పుడు కుదురుతుంటాయి. తాజాగా అలాంటి లెక్క ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. చాలా ఏళ్ల క్రితం భూమిక ఇలాంటి ఫీట్‌ చేయగా, ఇప్పుడు పూజా హెగ్డే చేస్తోంది. ఇంతకీ అదేంటంటే…

ప్రస్తుతం పాన్‌ ఇండియా హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంటోంది పూజా హెగ్డే. తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. ఇటీవల మహేష్‌బాబు 28వ సినిమాలో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. అయితే పవన్‌ కళ్యాణ్‌ – హరీశ్‌ శంకర్‌ సినిమా గురించి అధికారిక ప్రకటన రాకపోయినా అందులోనూ ఆమెనే నటిస్తోందనేది టాక్‌. ఈ సినిమా పవన్‌కు 28వ సినిమా అనే విషయం తెలిసిందే. ఇక తారక్‌తో ‘అరవిందసమేత’లోనూ పూజా హెగ్డేనే నటించింది. ఆ సినిమా ఎన్టీఆర్‌ ఖాతాలో 28వ సినిమా అనే విషయం తెలిసిందే.

ఇదీ మేం చెప్పిన కామన్‌ పాయింట్‌. ముగ్గురు టాప్‌ హీరోల 28వ సినిమాలో పూజనే హీరోయిన్‌. 28వ సినిమా అయిపోయింది కాబట్టి… ఇక ఏడో సినిమా సంగతి చూద్దాం. ఈ సినిమా విషయంలో నటి భూమిక ఇలాంటి ఫీటే చేశారు. పవన్‌ కల్యాణ్‌ ‘ఖుషి’, మహేష్‌బాబు ‘ఒక్కడు’, ఎన్టీఆర్‌ ‘సింహాద్రి’లో భూమికనే హీరోయిన్‌ అనే విషయం తెలిసిందే. ఆ సినిమాలు ఆ హీరోల కెరీర్‌లో ఏడో సినిమాలు అనేదే ఇక్కడ పాయింట్‌. అలా భూమిక చేసిన ఫీట్‌ను పూజా హెగ్డే ఇప్పుడు రిపీట్‌ చేసిందన్నమాట.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus