Hyper Aadi: కొత్త సమస్యల్లో చిక్కుకున్న హైపర్ ఆది..!

జబర్దస్త్ స్టార్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘జబర్దస్త్’ కామెడీ షో లో నాన్ స్టాప్ పంచ్ లతో ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాడు హైపర్ ఆది. ఇతని స్కిట్స్ బాగా ఫేమస్. ఎవర్నైనా ట్రోల్ చేయడానికి నెటిజన్లు ఇతని స్కిట్స్ లోని డైలాగులనే వాడుకుంటూ ఉంటారు. యూట్యూబ్ లో కూడా ఇతని స్కిట్స్ కు సంబంధించిన వీడియోలు.. మిలియన్ల కొద్దీ వ్యూస్ ను రాబడతాయి. ఇక సినిమాల్లో కూడా వరుస అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతున్నాడు ఆది.

ఇదిలా ఉండగా.. తాజాగా హైపర్ ఆది పై ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డికి తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఫిర్యాదు ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది. ఇటీవల ఆది ఓ కార్యక్రమంలో బతుకమ్మ, గౌరమ్మ, తెలంగాణ భాషను కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశాడని పేర్కొంటూ వారు కంప్లైంట్ ఇచ్చారట. ఆదితో పాటు స్క్రీఫ్ట్ రైటర్.. ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ పై కూడా వారు కంప్లైంట్ ఇచ్చినట్టు స్పష్టమవుతుంది.

ఇప్పుడు మాత్రమే కాదు ఆది పై గతంలో కూడా మానవ హక్కుల సంఘానికి కంప్లైంట్ వెళ్ళింది. ఆది స్కిట్స్ లో వారి మనోభావాలను దెబ్బతీసేలా డైలాగులు ఉంటున్నాయని.. అనాథ పిల్లలు మరియు సినీ క్రిటిక్ కత్తి మహేష్ వంటి వారు హెచ్.ఆర్.సి కి కంప్లైంట్ చేశారు. అయితే అవి పెద్దగా కాంప్లికేట్ కాలేదు. కానీ ఇప్ప్పుడు ఎల్బీ నగర్ పోలీసులు ఆది ఫిర్యాదు పై ఎలా రియాక్ట్ అవుతారు..? ఎలాంటి క్లారిటీ ఇస్తారు? అనే విషయాల పై చర్చ జరుగుతుంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus