Kartikeya: యువతి చేసిన పనికి బెదిరిపోయిన కార్తికేయన్.. అసలేం జరిగిందంటే..!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ నటించిన లేటేస్ట్ చిత్రం బెదురులంక 2012. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ వస్తోంది. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత కార్తికేయ నటించిన సినిమాలన్ని థియేటర్లలో డిజాస్టర్స్ అయ్యాయి. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అడియన్స్ ముందుకు వస్తున్నప్పటికీ సరైన హిట్టు మాత్రం పడలేదు. దీంతో బెదురులంక సినిమాపైనే కార్తికేయ ఆశలన్నీ ఉన్నాయి. డీజే టిల్లు ఫేమ్ నేహశెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది.

అయితే ముందు నుంచి ఈ సినిమా ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంటున్నారు కార్తికేయ. నేహాశెట్టితో కలిసి ఇప్పటికే జనాల్లో కలిసి సరదాగా గడిపారు. ఈ చిత్రంలోని సాంగ్స్, డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వస్తుండగా.. మరోవైపు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఇంట్రాక్ట్ అవుతున్నారు కార్తికేయ. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు.

నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వచ్చాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి చెప్పాలని ఓ నెటిజన్ అడగ్గా.. లక్కీ ఛార్మ్ అంటూ బదులిచ్చాడు. అలాగే చరణ్ సినిమాలో ప్రతినాయకుడిగా నటించాలని మరో నెటిజన్ కోరగా.. మంచి స్కోప్ ఉన్న పాత్ర అయితే తప్పకుండా చేస్తానని అన్నారు. ఈ క్రమంలోనే ఓ లేడీ అభిమాని కార్తికేయను బెదిరించింది. నువ్ నాకు రిప్లై ఇవ్వకపోతే చేయి కోసుకుంటాను అంటూ బ్లాక్ మెయిల్ చేసింది.

ఇది చూసిన కార్తికేయ (Kartikeya) దెబ్బకు భయపడిపోయి వెంటనే రిప్లై ఇచ్చాడు. అమ్మో వద్దు వద్దు అంటూ రిప్లై ఇవ్వగా.. థాంక్యూ అంటూ రిప్లై ఇచ్చింది సదరు యువతి. వీరిద్దరి మధ్య జరిగిన ఈ బ్లాక్ మెయిల్ సంభాషణ సరదాగానే జరిగినట్లు ఆ యువతి షేర్ చేసిన ఫోటో చూస్తే అర్థమవుతుంది.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus