Vishwak Sen: ‘ఇప్పటికైనా వివరం తెలిసిందా విశ్వక్?’ అంటూ ఆటాడుకుంటున్న నెటిజన్లు..!

సినిమాల్లో అంటే చెల్లిపోతుంది కానీ మీడియాతో మాట్లేడేటప్పుడు కానీ సోషల్ మీడియాలో ఏదైనా ఒక పోస్ట్ చేసేటప్పుడు కానీ సెలబ్రిటీలు ఆచితూచి వ్యవహరించాలి. లేదంటే తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆ ఎఫెక్ట్ వాళ్ల కెరీర్ మీద, సినిమాల కలెక్షన్ల మీద పడతాయి. ఇలాంటి సందర్భాలు ఇంతకుముందు చూశాం. తప్పు తెలుసుకుని దాన్ని సరిదిద్దుకుని సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటే దానికి మించిన ఉత్తమం మరోటి లేదు.

ఈ మాటలు యంగ్ హీరో విశ్వక్ సేన్ కి సరిగ్గా సరిపోతాయి. విశ్వక్ నటించిన కొత్త సినిమా ‘ఓరి దేవుడా’ అక్టోబర్ 21న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. విక్టరీ వెంకటేష్ కీ క్యారెక్టర్ చెయ్యడంతో సినిమా మీద హైప్ క్రియేట్ అయ్యింది. మిథిలా పాల్కర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ తమిళ్ లో సూపర్ హిట్ అయిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘ఓ మై కడవులే’ కి అఫీషియల్ రీమేక్.

ఇక విశ్వక్ సేన్ విషయానికొస్తే.. తన సినిమాల ప్రమోషన్స్ టైంలో వాటిని బిల్డ్ చేసుకోవడానికి.. తన మూవీస్ మీద హైప్ తీసుకు రావడానికి ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంటాడు.. అంటూ గతంలో విశ్వక్ తన స్పీచ్ లో వాడిన మాటలను షేర్ చేస్తూ.. ఇప్పటికైనా వివరం తెలిసిందా విశ్వక్ సేన్ అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ‘ఫలక్ నుమా దాస్‘ అప్పుడు ‘నాకు ఎవరి సపోర్ట్ లేదు కానీ నన్ను నేను లేపుకుంటా’ అన్నాడు.

తర్వాత ‘పాగల్’ టైంలో ‘మూసుకున్న థియేటర్లు తెరిపిస్తా’ అన్నాడు. ఇక ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అప్పుడు జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. సినిమా ప్రమోషన్ కోసం ప్రాంక్ చేయించి యాంకర్ దేవి నాగవల్లితో కాంట్రవర్సీ పెట్టుకున్నాడు. కట్ చేస్తే ఇప్పుడు ‘ఓరి దేవుడా’ ప్రమోషన్స్ లో విశ్వక్ మార్క్ కాంట్రవర్సీ మిస్ అయ్యింది.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్ మీద విశ్వక్ ఎలా రియాకట్ అవుతాడో చూడాలి..

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus