సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో 25 వ చిత్రం ప్రత్యేకంగా నిలిచిపోవాలని కోరుకుంటున్నారు. అందుకే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మహర్షి చిత్రానికి ఎక్కువ డేట్స్ కేటాయించారు. రైతుల కష్టాలపై సాగే ఈ చిత్రం స్టడీగా షూటింగ్ జరుపుకుంటోంది. మొన్నటి వరకు డెహ్రా డూన్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేసిన వంశీ నెక్స్ట్ షెడ్యూల్ ని విదేశాల్లో ప్లాన్ చేశారు. దాని తర్వాత గ్రామాల్లో షూటింగ్ జరుపుకోవాలి. గ్రామాల్లో షూటింగ్ కి అంతరాయం కలుగుతుందని భావించి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారు. భారీ ఖర్చుతో అక్కడ విలేజ్ సెట్ ను వేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు .. ఈ విలేజ్ సెట్ ను చాలా సహజంగా తీర్చిదిద్దుతున్నారు.
“మహర్షి” టీమ్ విదేశాల నుంచి తిరిగి వచ్చేలోగా ఈ సెట్ ను పూర్తి చేస్తారని తెలిసింది. ఇక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. మహేష్ తల్లిదండ్రులుగా జయసుధ, ప్రకాష్ రాజ్ లు నటిస్తున్న ఈ మూవీలో మహేష్ స్నేహితుడిగా అల్లరి నరేష్ కనిపించబోతున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని అందించే పనిలో ఉన్నారు. దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఉగాది కానుకగా ఏప్రిల్ 5 న థియేటర్లోకి రానుంది. భరత్ అనే నేను తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.