బాలీవుడ్ సీనియర్ నటుడు, ఒకప్పటి స్టార్ హీరో అయినటువంటి సంజయ్ దత్ (Sanjay Dutt) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘ఖల్నాయక్’ ‘మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్’ ‘లగేరహో మున్నాభాయ్’ (Lage Raho Munna Bhai) వంటి సినిమాలతో స్టార్ గా ఎదిగారు. ఆ తర్వాత కూడా ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. ఇప్పుడు కూడా ఆయన విలక్షణమైన పాత్రలు చేస్తూ వస్తున్నారు. ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ (KGF 2) ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) ‘ది రాజాసాబ్’ (The Rajasaab) వంటి సినిమాలతో సంజయ్ దత్ తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.
ఇదిలా ఉండగా.. సంజయ్ దత్ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అతనికి ఏ రేంజ్ అభిమానులు ఉన్నారో గుర్తుచేసింది. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన నిషా పాటిల్ అనే మహిళ 2018 లో మరణించింది. ఆమె సంజయ్ దత్ కి డై హార్డ్ ఫ్యాన్. అది ఏ రేంజ్లో అంటే.. చనిపోయే ముందు తన అభిమాన హీరో కోసం ఏకంగా తన రూ.72 కోట్ల ఆస్తి రాసిచ్చేసింది. చనిపోయే టైంకి నిషా పాటిల్ వయసు 62 ఏళ్ళు.
అయితే ఆమె చనిపోయే ముందు బ్యాంకులకు, లీగల్ టీంకి కొన్ని లెటర్స్ రాసిందట. అందులో తన యావదాస్తిని తన అభిమాన హీరో సంజయ్ దత్ కి చేరాలని కోరినట్టు తెలుస్తోంది. ముంబై పోలీసులు, లీగల్ టీం ఈ విషయమై సంజయ్ దత్ కి ఫోన్ చేశారట. దీంతో సంజయ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నిషా ఎవరో కూడా సంజయ్ కి తెలీదు. ఒక్కసారిగా సంజయ్ ట్రాన్స్ లోకి వెళ్లిపోయారట.
అయితే ఆమె ఆస్తి తీసుకోవడానికి సంజయ్ (Sanjay Dutt) ఇష్టపడలేదు. నిషా లాంటి అభిమానులు కూడా ఉంటారా? అని అతను ఆమె లీగల్ టీంకి చెప్పారట. అందువల్ల నిషా అభిమానం.. ఆమె ఇచ్చిన ఆస్తి కంటే విలువైనది. ఆమె కష్టార్జితం అంతా ఆమె కుటుంబ సభ్యులకే చేరాలి అని నిషా లీగల్ టీంతో పాటు తన లీగల్ టీంకి కూడా చెప్పారట సంజయ్ (Sanjay Dutt).