Urvashi Rautela: అది చేస్తేనే మీ ఫోన్ ఇస్తా..!

ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న హీరోయిన్స్ పేర్లలో ఊర్వశి రౌతేలా కూడా ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ .. అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగులో చిరంజీవి, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోలతో ఐటం సాంగ్స్ చేసి ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ఊర్వశి రౌతేలా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు, హాట్ ఫొటోలను అభిమానుల కోసం తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.

అయితే ఇటీవలే తన ఫోన్‌ను ఊర్వశి రౌతేలా పోగొట్టుకుందనే విషయం అందరికి తెలిసిందే. ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్‌ చూడటానికి వచ్చి ఊర్వశి రౌతేలా తన ఫోన్‌ను పోగొట్టుకుంది. అంతకముందే తాను ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ చూడటానికి మైదానానికి వచ్చానని ఓ వీడియోను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఊర్వశి రౌతేలా గ్రౌండ్‌కు రావడంతో అభిమానులు భారీ ఎత్తున ఆమెను చూడటానికి ఎగబడ్డారు. ఆ సమయంలోనే ఊర్వశి రౌతేలా పోగొట్టుకుంది.

నా ఫోన్ కనిపించడం లేదని..ఎవరికైనా మొబైల్ దొరికితే ఇవ్వాలని అభిమానులను ఊర్వశి రౌతేలా రిక్వెస్ట్ చేసింది. ఫోన్ తిరిగి ఇచ్చిన వారి బాహుమతి కూడా ఇస్తానని ఈ హాట్ హీరోయిన్ ప్రకటించింది. ఫోన్ దొరికిందని ఓ అజ్ఞాతవాసి తనకు మెయిల్ చేశాడని ఊర్వశి రౌతేలా చెప్పుకొచ్చింది. అయితే ఫోన్ తిరిగి ఇవ్వడానికి అతను ఓ కండిషన్ కూడా పెట్టాడని ఊర్వశి రౌతేలా వెల్లడించింది.

‘క్యాన్సర్‌తో బాధపడుతున్న నా సోదరుడిని కాపాడుకోవడం కోసం సాయం చేయండి’ ఫోన్ మీకు తిరిగి ఇస్తానని సదరు వ్యక్తి కండీషన్‌ పెట్టాడు. దీనికి ఊర్వశి రౌతేలా కూడా సరే అంటూ సమాధానం ఇచ్చారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. మొత్తానికి (Urvashi Rautela) ఊర్వశి రౌతేలా ఫోన్ ఓ ప్రాణాన్ని నిలబెట్టిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus