Ram Charan, Alia Bhatt: రామ్ చరణ్, అలియాలతో రాజమౌళి ప్లాన్!
- November 30, 2021 / 03:47 PM ISTByFilmy Focus
ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేయనున్నారు. దీంతో సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు షురూ చేశారు. ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన కొన్ని టీజర్లకు, పాటలను విడుదల చేశారు. ఇప్పుడు ట్రైలర్ ను కూడా విడుదల చేయనున్నారు. అయితే ఇప్పడూ రాజమౌళి ఓ ప్రమోషనల్ సాంగ్ ను చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారట. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయిపోయింది. సెన్సార్ పనులు కూడా దాదాపు కంప్లీట్ అయినట్లే.

ఇప్పుడు మళ్లీ సెట్స్ పైకి వెళ్తానని అంటున్నారు రాజమౌళి. రామ్ చరణ్, అలియాభట్ ల మీద ప్రమోషనల్ సాంగ్ ను చిత్రీకరిస్తే.. బాలీవుడ్ లో బాగా ప్రమోట్ చేసుకోవచ్చని భావిస్తున్నారు. కానీ ఇప్పుడు సమయం సరిపోతుందా..? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. దీంతో రాజమౌళి సినిమా ట్రైలర్ గనుక బాగా క్లిక్ అయితే ప్రమోషనల్ సాంగ్ ఆలోచనను విరమించుకుంటారట. లేదంట కచ్చితంగా సాంగ్ చిత్రీకరణ ఉంటుందని అంటున్నారట. మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!
నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!
Most Recommended Video
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

















