Tagore Movie: ఆ రికార్డు సొంతం చేసుకున్న తొలి తెలుగు సినిమాగా ఠాగూర్!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించినటువంటి సినిమాలలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నటువంటి ఠాగూర్ సినిమా ఒకటి. ఈ సినిమా లో చిరంజీవి అవినీతిపై పోరాటం చేసే ఒక హీరోగా అద్భుతంగా నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి 20 సంవత్సరాలను పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో ఈ సినిమా గురించి కొన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

నిజానికి ఈ సినిమా తమిళ డబ్బింగ్ సినిమా అనే విషయం మనకు తెలిసిందే. తమిళంలో మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన రమణ తమిళ సినిమాని తెలుగులో ఠాగూర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే ఈ సినిమా తెలుగులో చిరంజీవి చేస్తున్నారని తెలియగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సినిమాలో ఎలాంటి పాటలు లేవు అలాగే ఎలాంటి కమర్షియల్ హంగులు లేవు దీంతో చిరంజీవి ఈ సినిమా చేయడమేంటి అని అందరూ ఆశ్చర్యపోయారు.

తమిళంలో ఈ సినిమాని మురగదాస్ చేసినప్పటికీ తెలుగులో మాత్రం వివి వినాయక్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు . ఇక తెలుగులో కూడా మురగదాస్ డైరెక్షన్ చేయమంటే ఈ సినిమాలో తాను ఎలాంటి పాటలను పెట్టనని చెప్పారు. కానీ చిరంజీవికి అనుకూలంగా ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో కొన్ని మార్పులు చేసి సినిమాలో పాటలను కూడా జోడించి వినాయక్ ఈ సినిమాని ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

ఇలా ఈ సినిమా 2003వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట్లో కాస్త మిక్స్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ అనంతరం ఈ సినిమా కమర్షియల్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకుందని చెప్పాలి. అవినీతి చేస్తున్నటువంటి అధికారులను అంతమొందిస్తూ చిరుచేసే ఈ పోరాటం అందరికీ ఎంతగానో నచ్చింది. ఇక ఈ సినిమాలో తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం అనే డైలాగ్ అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయింది.

ఈ సినిమా మొత్తం 600ల థియేటర్లలో విడుదలై 253 కేంద్రాలలో అర్థ శత దినోత్సవం వేడుకలను జరుపుకుంది. ఇలా ఈ స్థాయిలో అత్యధిక థియేటర్లలో అర్థశత దినోత్సవ వేడుకలను జరుపుకున్నటువంటి తొలి తెలుగు సినిమాగా ఠాగూర్ సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది. అదేవిధంగా 191 కేంద్రాలలో 100 రోజులను దిగ్విజయంగా పూర్తి చేసుకుని అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus