అక్కడి రోడ్డుకు సోనూ సూద్‌ తల్లి పేరు

గొప్ప గొప్ప పనులు చేసి మనం మంచి పేరు తెచ్చుకోవడమే కాదు, వాటి వల్ల కుటుంబానికి కూడా మంచి పేరు రావాలంటుంటారు పెద్దలు. బిడ్డలు చేసిన మంచి పనికి ఏకంగా ఓ ఊళ్లో రోడ్డుకు తన తల్లి పేరు పెడితే, ఆ పిల్లల ఆనందం ఏ స్థాయిలో ఉంటుందా తెలుసా? ఆ విషయం తెలియాలంటే మీరు సోనూ సూద్‌ ముఖం చూడాల్సిందే. ఎందుకంటే ఆ బిడ్డ సోనూ అయితే, ఆ తల్లి సరోజా సూద్‌. పంజాబ్‌లోని సోనూ సొంతూరు మోగాలో ఓ రోడ్డుకు అతని తల్లి సరోజా సూద్‌ పేరు పెట్టారు. ఈ సందర్భంగా సోనూ తన ఆనందాన్ని పంచుకున్నాడు.

‘‘ ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం ‘ప్రొఫెసర్ సరోజ్‌సూద్ రోడ్’ అని ఇప్పుడు నేను గర్వంగా చెబుతున్నాను. నా జీవితంలో ఇప్పటివరకు కలలుగన్న దృశ్యం ఇది. ఈ సందర్భం నా జీవితంలో అతి ముఖ్యమైన అధ్యాయం. నా సొంత ఊరు మోగాలోని రోడ్డుకు నా తల్లి పేరు పెట్టడం ఆనందంగా ఉంది. మా అమ్మ తన జీవితమంతా అదే రోడ్డు మీద ప్రయాణించింది. ఇంటి నుంచి కాలేజీకి, అక్కడి నుంచి తిరిగి ఇంటికి ఇదే రోడ్డులో వచ్చేది. స్వర్గంలో ఉన్న నా తల్లిదండ్రులు ఈ సందర్భం చూసి సంతోషిస్తుంటారు’’ అని సోనూసూద్‌ అన్నాడు.

కరోనా -లాక్‌డౌన్‌ కాలంలో సోనూ సూద్‌ సమాజ సేవ గురించి కొత్తగా చెప్పేదేముంది. కష్టం అంటే నేనున్నా అంటూ ముందుకొచ్చాడు. హాలీవుడ్‌ సినిమాల్లో సూపర్‌ హీరోలు వస్తారే అలా అన్నమాట. విమానాలు, రైళ్లు, బస్సులు వేసి వలసదారులను సొంతూళ్లకు పంపించాడు. సోషల్‌ మీడియాలో కష్టం అనే మాట వినిపించి, అది ఆయన చెవిన పడితే స్పందించి ఆదుకున్నాడు. అప్పుడప్పుడు తను సాయం చేసిన వారి దగ్గరకు వెళ్లి బాగోగులు అడిగి తెలుసుకుంటున్నాడు కూడా. ఇలాంటి సూపర్‌ హీరో తల్లికి దక్కిన ఈ గౌరవం అందరికీ గౌరవమే.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus