టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి అందరికీ సుపరిచితమే. బాలయ్య – బోయపాటి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా ‘సింహా’ లో ‘సింహమంటి చిన్నోడే’ అనే పాటతో తన సినీ కెరీర్ ను మొదలుపెట్టింది. అటు తర్వాత ‘ఖలేజా’ ‘బద్రీనాథ్’ ‘కందిరీగ’ ‘రాజన్న’ ‘దమ్ము’ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ‘రెబల్’ ‘ఎం.సి.ఎ’ వంటి బడా సినిమాల్లో పాటలు పాడింది. శ్రావణ భార్గవి చివరిగా 2018 లో వచ్చిన ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రంలో ఓ పాట పాడింది. ఆ తర్వాత ఈమె పాటలు పాడింది లేదు.
‘గబ్బర్ సింగ్’ లో శృతిహాసన్ కు, ‘ఈగ’ లో సమంత కి డబ్బింగ్ చెప్పింది. కొంత గ్యాప్ తర్వాత ఈమె లైగర్ సినిమాలో ఒక పాట పాడి రీ ఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లో పాటలు పాడకపోయినా ఈ మధ్య కాలంలో శ్రావణ భార్గవి ఎక్కువగా వార్తల్లో నిలిచింది. తన భర్త హేమచంద్ర తో విడాకులు తీసుకుందంటూ కొన్ని రోజులు వార్తల్లో నిలిస్తే..
అన్నమయ్య రాసిన ‘ఒకపరికొకపరి వయ్యారమై…’ కీర్తనను శృంగారభరితంగా మార్చిందంటూ అన్నమయ్య కుటుంబ సభ్యులు ఈమె పై మండిపడ్డారు. అంతేకాదు శ్రావణ భార్గవి ని తిరుపతిలో అడుగుపెట్టనివ్వం అంటూ టీటీడీ సభ్యులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఇష్యూలో ఆమె పై పోలీస్ కేసు ఫైల్ అవ్వడం కూడా జరిగింది.
ఈ విషయాలు పక్కన పెట్టిస్తే.. శ్రావణ భార్గవి (Sravana Bhargavi) హల్దీ వేడుకల్లో సందడి చేసిన ఫోటోలు కొన్ని ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో ఆమె రెండో పెళ్లి వార్తలు మళ్ళీ తెరపైకి వచ్చాయి. కానీ శ్రావణ భార్గవి హల్దీ వేడుకలు ఫోటోలు 2022 లో జరిగిన ఆమె సోదరుడు పెళ్లి వేడుకలోవి..!
బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!