అదేదో సినిమాలో ‘ఫలానా సెంటర్‌లో బట్టలిప్పుకొని తిరుగుతా’ అని ప్రధాన నటుడు అంటాడు. ఇలా కూడా చేస్తారా? ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అనే డౌట్ కొంతమందికి రావొచ్చు. అలాంటి డౌట్ వచ్చింది అంటే మీరు ‘బాయ్స్’ సినిమా చూడలేదు అనే చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమాలో ప్రేమ కోసం హీరో సిద్ధార్థ్ (Siddharth) సెంటర్‌లో బట్టలు విప్పుకొని పరుగుపెడతాడు. ఆ రోజుల్లో ఆ సీన్ ఎలా తీశారో అంటూ తెగ మాట్లాడుకునేవారు.
21 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా గురించి మాట్లాడినప్పుడల్లా ఆ సీన్ గుర్తొస్తుంది. అంత ఎఫెక్టివ్‌గా దర్శకుడు శంకర్ (Shankar) ఆ సీన్‌ను తెరకెక్కించారు కూడా. ఇక ఆ సీన్ కోసం సిద్ధార్థ్ (Siddharth) చేసిన డేరింగ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ క్రమంలో సినిమా షూటింగ్‌లో ఆ సీన్ కోసం పడ్డ శ్రమ, ఖర్చు గురించి కూడా మాట్లాడాలి. మొత్తంగా ఆ సీన్‌ను తీయడానికి ఆ రోజుల్లోనే రూ.కోటి ఖర్చయింది అని టాక్.
‘బాయ్స్’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన విషయం గురించి ఇప్పటికీ చెన్నై జనం తలుచుకుంటూ ఉంటారు. హీరోయిన్ జెనీలియా (Genelia) ప్రేమ కోసం నగ్నంగా రోడ్ల వెంట పరిగెట్టే సీన్ అది. ఆ సీన్ కోసం చెన్నైలోని మౌంట్ రోడ్‌ను వాడుకుంది ‘బాయ్స్’ టీమ్. రోజూ సాయంత్రం రెండు గంటల నుండి ఆరు గంటల వరకు సుమారు 15 రోజులు ఆ రోడ్డును బ్లాక్ చేసి షూట్ చేశారట.
ట్రాఫిక్, పెద్ద ఎత్తున పబ్లిక్ ఉండేలా చూసుకుంటూ సీన్ సహజత్వం కోల్పోకుండా టీమ్ ప్లాన్ చేసిందట. ఆ సీన్‌లో కనిపించే జనాలు అంతా జూనియర్ ఆర్టిస్టులే. వందల మంది నటులను ఆ సీన్ కోసం తరలించారు. మొత్తంగా ఆ రోజుల్లో ఆ సీన్ కోసం ఖర్చు రూ. కోటికిపైగా ఖర్చయిందట. ఆ సీన్ కోసమే అంత పెడితే.. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) కోసం ఎంత పెట్టించారో అనే డౌట్ మీకు వస్తే రావొచ్చు.