బాహుబలి1, బాహుబలి2 సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేయడం గమనార్హం. ఈ సినిమాల నిర్మాతలలో ఒకరైన శోభు యార్లగడ్డ ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కొన్ని సినిమాలు థియేటర్లకు సూట్ అవుతాయని కొన్ని సినిమాలు ఓటీటీకి సూట్ అవుతాయని ఆయన అన్నారు.
ఓటీటీలకు రీచ్ అంతకంతకూ పెరిగిపోతుందని ఆయన చెప్పుకొచ్చారు. థియేటర్లు లేని ప్రాంతాలలో ఓటీటీ రీచ్ ఎక్కువగా ఉంటుందని శోభు యార్లగడ్డ అన్నారు. స్క్రిప్ట్ ను బట్టి ఏ సినిమా థియేటర్ కు సూట్ అవుతుందో ఏ సినిమా ఓటీటీకి సూట్ అవుతుందో సులభంగా చెప్పవచ్చని ఆయన అన్నారు. ప్రతి నిర్మాతకు సొంత లెక్కలు ఉంటాయని ఆయన తెలిపారు. బాహుబలి సినిమా బడ్జెట్ మార్కెట్ కంటే ఎక్కువని మనం అవసరం అనుకుంటే ఈ ప్రాజెక్ట్ ను ఆపేసి మరో ప్రాజెక్ట్ తో ముందుకు వెళదామని రాజమౌళి అన్నారని శోభు యార్లగడ్డ పేర్కొన్నారు.
అయితే మేము రిస్క్ తీసుకుని ఆ సినిమాలను చేశామని శోభు యార్లగడ్డ అన్నారు. బాహుబలి ప్రొడక్షన్ సమయంలో చాలా నెగిటివ్ కామెంట్లు వచ్చాయని ఆయన తెలిపారు. బాహుబలి సినిమాకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయని ఆయన చెప్పుకొచ్చారు. కరోనా తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే విషయంలో జడ్జ్ చేయలేకపోయామని శోభు యార్లగడ్డ అన్నారు. ప్రస్తుతం పెద్ద సినిమాలకు సైతం ఓపెనింగ్స్ రావడం లేదని ఆయన తెలిపారు.
జనాలకు ఏది ఎప్పుడు నచ్చుతుందో చెప్పలేమని అయితే మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని ఆయన తెలిపారు. శోభు యార్లగడ్డ వెల్లడించిన విషయాలు వైరల్ అవుతున్నాయి. భవిష్యత్తులో రాజమౌళి డైరెక్షన్ లో ఈ నిర్మాతల కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది.
Most Recommended Video
శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!