సినీ పరిశ్రమలో ఘోర విషాదం.. నటిని హత్య చేసిన కొడుకు!

‘తల్లి ప్రేమ ముందు కోట్ల రూపాయల డబ్బు కూడా విలువైనది కాదు’ అని చాలా మంది అంటుంటారు. ఇంకో రకంగా అమ్మ ప్రేమను డబ్బుతో కూడా కొనలేం. కొడుకు క్షేమం కోసం తల్లి ఎలాంటి త్యాగానికైనా రెడీ అవుతుంది. కానీ తల్లి పై కొడుకుకి కూడా అలాంటి ప్రేమే ఉంటుందా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేం. ఇప్పుడు చెప్పుకోబోతున్న విషయం కూడా దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఓ సీనియర్ నటి కొడుకు చేతిలో దారుణంగా హత్య చేయబడింది.

ఈ ఘోరమైన సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఒక్కసారిగా అందరినీ విషాదంలోకి నెట్టేసిన న్యూస్ ఇది అని చెప్పవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ సీనియర్ నటి అయిన కాళీ అమ్మాల్ ను ఆమె కన్న కొడుకే దారుణంగా హత్య చేశాడు. ఫిబ్రవరి 4 న ఈ ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అనే చెప్పాలి.

కాళీ అమ్మాల్ (Kaliammal) కొడుకు నమ్మకోడి పచ్చి తాగుబోతు. డబ్బు కోసం కుటుంబ సభ్యులను నిత్యం ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఈ క్రమంలో తన తల్లి మద్యానికి డబ్బు ఇవ్వడం లేదు అని..ఆమెతో పెద్ద గొడవ పెట్టుకున్నాడు. అదే కోపంతో ఆమె పై దాడి చేసి దారుణంగా హత్య చేసినట్లు స్పష్టమవుతుంది. కాశీ అమ్మాల్ వయసు 74 ఏళ్ళు అని సమాచారం. ఆమె చివరిగా విజయ్ సేతుపతి నటించిన ‘చివరి వ్యవసాయదారుడు’ అనే సినిమాలో నటించింది.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus