Prabhas: ఇంత గొడవ జరుగుతున్నా స్పందించని ప్రభాస్..!

యంగ్ రెబెల్ స్టార్ హీరో గా నటించిన ‘సలార్’ చిత్రానికి మార్కెట్ లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సెప్టెంబర్ 28 వ తారీఖున గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వాల్సిన ఈ సినిమా, కొన్ని అనుకోని కారణాల వల్ల డిసెంబర్ 22 వ తారీఖుకి వాయిదా పడింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ట్రేడ్ లో అంచనాలను మరింత రెట్టింపు చేసాయి. కానీ డిసెంబర్ 22 వ తారీఖున ‘సలార్’ చిత్రం తో పాటుగా షారుఖ్ ఖాన్ ‘దుంకీ’ సినిమా కూడా విడుదల అవ్వబోతుండడం తో ఓవర్సీస్ లో ఈ చిత్రం బిజినెస్ ముందు అనుకున్న దానికంటే 30 శాతం తగ్గింది.

కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా క్రేజ్ మార్కెట్ లో ఏమాత్రం తగ్గలేదు. టాప్ డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలు ఎంత అడిగితే అంత ఇచ్చి కొనుగోలు చెయ్యడానికి పోటీ పడుతున్నారు. ఈ పోటీ లో నైజాం ప్రాంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రాంతం లో ఇలాంటి క్రేజీ మూవీస్ ని కొనుగోలు చెయ్యాలంటే దిల్ రాజు ముందు ఉంటాడు. ఈ ‘సలార్’ హక్కుల కోసం దిల్ రాజు తో పాటుగా యూవీ క్రియేషన్స్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ పోటీ పడ్డాయి.

దిల్ రాజు హోమబుల్ సంస్థ వారు అడిగేంత డబ్బులు ఇవ్వలేక వెనకడుగు వేసాడు. ఇక రైట్స్ కోసం మిగిలిన రెండు ప్రొడక్షన్ హౌస్లు పోటీ పడ్డాయి. ఈ పోటీ లో యూవీ క్రియేషన్స్ నైజాం రైట్స్ ని దక్కించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. యూవీ క్రియేషన్స్ ప్రభాస్ సొంత అన్నయ్య మరియు స్నేహితులు కలిసి పెట్టిన బ్యానర్. ఇందులో ప్రభాస్ కూడా ఒక వాటాదారుడు. కానీ నైజాం రైట్స్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ కి రప్పించే విషయం లో ప్రభాస్ అసలు జోక్యం చేసుకోలేదట.

దీంతో నైజాం హక్కులు ‘మైత్రీ మూవీ మేకర్స్’ సొంతం చేసుకుంది. రైట్స్ ఇప్పించే విషయం లో ప్రభాస్ జోక్యం చేసుకోకపోవడం వల్ల ప్రభాస్ అన్నయ్య ప్రభోద్ మరియు ప్రభాస్ స్నేహితుల మధ్య గొడవలు చెలరేగాయట. ఇవన్నీ తెలిసి కూడా ప్రభాస్ (Prabhas) ఏమి తెలియనట్టే తన పని తానూ చేసుకుంటూ పోతున్నాడట.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus