టాలీవుడ్ కు ‘స్టూవర్ట్ పురం’ కాన్సెప్ట్ కలిసి రాలేదు అనే కామెంట్స్ ముందు నుండీ వినిపిస్తూనే ఉన్నాయి. 1991లో చిరంజీవి హీరోగా యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో ‘ ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’ అనే సినిమా రూపొందింది. అది దారుణంగా ప్లాప్ అయ్యింది. చిరంజీవి నటించిన అనేక హిట్ సినిమాలకి రైటర్ గా పనిచేసిన యండమూరి దర్శకుడిగా మాత్రం చిరుకి హిట్ ఇవ్వలేకపోయాడు. మరోపక్క భానుచందర్ నటించిన ‘స్టూవర్ట్ పురం దొంగలు’ సినిమా కూడా పెద్ద ప్లాప్ అయ్యింది.
దీనికి సాగర్ దర్శకుడు. ఈ రెండు సినిమాలు ప్లాప్ అవ్వడంతో తెలుగులో ఈ బ్యాక్ డ్రాప్ సినిమాలు హిట్ అవ్వవు అనే ముద్ర పడింది. ఇటీవల వచ్చిన ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంతో ఆ సెంటిమెంట్ మరోసారి నిజమైంది. ఈ సినిమాకి మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ముఖ్యంగా ‘భగవంత్ కేసరి’ ‘లియో’ వంటి సినిమాల పోటీకి ఈ సినిమా నిలబడలేకపోయింది.
లెంగ్త్ ఎక్కువైంది అనే టాక్ కూడా వచ్చింది. ఫైనల్ గా కొంత భాగాన్ని ట్రిమ్ చేయడం కూడా జరిగింది. అయినా ఈ సినిమా కిందా మీదా పడి రూ.25 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. వాస్తవానికి ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ ను బెల్లంకొండ శ్రీనివాస్ తో చేయాలని ముందుగా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు వర్కౌట్ కాలేదు. ఒకవేళ బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) కనుక చేసుంటే.. రెండో రోజుకే ‘టైగర్ నాగేశ్వరరావు’ షెడ్డుకి వెళ్లిపోయేది అనడంలో అతిశయోక్తి లేదు.
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!